వరసగా ఎన్నికల్లో ఓడుతూ ఉన్నా ఢిల్లీలో కాంగ్రెస్ కు మాత్రం కొత్త నేతలు గతి లేకుండా పోయారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ షీలా దీక్షిత్ - అజయ్ మాకెన్ వంటి కాలం చెల్లిన నేతలనే పోటీకి దించింది. ఆల్రెడీ వీళ్లను అక్కడి జనాలు తిరస్కరించారు.
షీలా దీక్షిత్ ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రే కానీ - ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి కూడా జనాలు ఉత్సాహం చూపించలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆప్ సునామీలో కొట్టుకుపోయారు షీలా. ఇక అజయ్ మాకెన్ ది కూడా అదే కథ. గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు.
ఇదంతా జరిగి మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ సారి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కనీసం ఢిల్లీ వరకూ అయినా ఆప్- కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటాయని అంతా అనుకున్నారు. అయితే ఆ పొత్తు చెల్లలేదు. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు చేసిన ఆప్ చివరకు పొత్తుకు నో చెప్పింది. ఢిల్లీలో మూడు సీట్లను ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. అవి ఇవ్వడం కూడా మీకు వేస్ట్.. మీకు ఇస్తే ఆ సీట్లను బీజేపీ నెగ్గుతుందంటూ ఆప్ వ్యాఖ్యానించింది.
ఒకవేళ హర్యానా - పంజాబ్ లలో ఆప్ కు కాంగ్రెస్ కొద్దో గొప్పో సీట్లను కేటాయించి ఉంటే.. ఢిల్లీలో ఆ పార్టీకి కాంగ్రెస్ కు సీట్లను ఇచ్చేదేమో. స్థూలంగా పొత్తు అయితే చిత్తు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత మొహాలతోనే ఎన్నికల బరిలోకి దిగుతోంది!