తమకు తిరుగులేదని విర్రవీగేవాడిని ఎవరు దెబ్బేస్తారో లేదో కానీ.. కాలం మాత్రం గట్టిగానే దెబ్బేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఈ విషయం నిరూపితమైంది కూడా. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు తిరుగులేదనే స్థితి నుంచి.. ప్రాంతీయ పార్టీలు మొదలు బలమున్న ప్రతిపార్టీ తమను కూడా కలుపుకోవాలన్న ఆరాటపడిపోయే దుస్థితికి చేరుకుంటుందని ఎవరైనా ఊహించారా?
ఒకప్పుడు కాంగ్రెస్ తో జత కట్టటానికి భారీగా కండీషన్లు పెట్టేది. టర్మ్స్ డిక్టేట్ చేసేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. తమతో పొత్తు పెట్టుకోవాలని ఓపెన్ గా కోరుకోవటమే కాదు.. అరే.. మమ్మల్ని మర్చిపోతారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి కాంగ్రెస్ వచ్చేసింది. తాజాగా ఆపార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాటలే దీనికి నిదర్శనం. ఢిల్లీ పీఠాన్ని ఎవరు అందుకోవాలన్నా అందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు సొంతం చేసుకుంటే వారిదే హవా. మరి.. యోగి సర్కారుకు చుక్కలు చూపించాలంటే బలమైన పొత్తులు ఉండాల్సిందే.
ఎవరి దారి వారిది అయితే బీజేపీకి షాకివ్వలేమన్న సత్యాన్ని గుర్తించిన సమాజ్ వాదీ.. బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఆ మధ్యన వీరిద్దరు కాంగ్రెస్ తో కలిసి మహా కూటమిగా ఏర్పడటం.. అది సక్సెస్ కావటంతో.. ఇప్పుడు అలాంటి పొత్తు మీద కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే.. కాంగ్రెస్ కూటమిలోకి వస్తే వచ్చే ఇబ్బందుల దృష్ట్యా.. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా పొత్తు మాటను చెప్పేశాయి రెండు పార్టీలు.
వీరిద్దరి పొత్తుపై తాజాగా కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది. కాంగ్రెస్ ను మర్చిపోయి డేంజర్ మిస్టేక్ చేస్తున్నట్లుగా తన ఆవేదనను కాసింత హెచ్చరిక స్వరంలో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష పార్టీలన్నింటి లక్ష్యం బీజేపీని ఓడించటమేనని.. అలాంటప్పుడు ఎస్పీ.. బీఎస్పీలు రెండు కాంగ్రెస్ ను విస్మరించటం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అఖిలేశ్.. మాయావతిలు ఇద్దరు జట్టు కట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ నేత రాజీవ్ భక్తి వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఎస్పీ.. బీఎస్పీల పొత్తుపై ఈ రోజు స్పష్టత రానుంది. అఖిలేశ్.. మాయావతి ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. వీరితో పాటు ఆర్ ఎల్ డీ.. నిషద్ పార్టీలు కూడా కలవనున్నాయి. మరింత గ్రాండ్ అలయన్స్ లో తాను ఉండకపోవటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని చెప్పాలి. మోడీని దెబ్బేయాలంటే యూపీలో మెజార్టీ సీట్లు తమ కూటమి ఖాతాలో పడాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్‌కు.. తాజా పరిణామాలు మింగుడుపడని విధంగా మారాయని చెప్పక తప్పదు.
Full View