2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పాల్గొన్న ప్రతి సభలోనూ ఒక మాటను పదే పదే చెప్పేవారు. బాబు వస్తే జాబు పక్కా అని అందరూ అనుకుంటున్నారని.. అదే జరుగుతుందని ఆయన నమ్మకంగా చెప్పేవారు. నిజానికి ఇలాంటి హామీల మీద పెద్ద నమ్మకం లేకున్నా.. చెబుతున్నది చంద్రబాబు కావటం.. పదేళ్ల తర్వాత పవర్ కోసం పాకులాడుతున్న నేపథ్యంలో.. ఆయన కానీ అధాకరంలోకి వస్తే ఎంతోకొంత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపించేది.
అయితే.. వాస్తవంలో అదెలా పని చేసిందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటికో ఉద్యోగం సంగతి తర్వాత వీధికి ఒకటి చొప్పున కూడా ఉద్యోగాలు రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల్లో మేజిక్ చేసిన బాబు మాటను కాంగ్రెస్ పార్టీ తాజాగా అందిపుచ్చుకుంది. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన ఐదు రాష్ట్రాలు (నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతం) ఎన్నికల సందర్భంగా అసోంలో బాబు తరహా హామీని ఇస్తోందిన కాంగ్రెస్ పార్టీ.
ఈసారి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. పవర్ ను ఏ విధంగానైనా నిలుపుకోవాలన్న గట్టి ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా అలివికాని ఇంటికో ఉద్యోగం మాటను అసోం ఎన్నికల్లో నొక్కి వక్కాణిస్తోంది. ఏపీలో బాబుకు వర్క్ వుట్ అయిన ‘‘ఇంటికో జాబ్ మాట’’ అసోంలో ఎంతమేర ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.