ఉప ఎన్నిక జరగటమే ఆలస్యం తాను గెలిచిపోయినట్లే అని మాజీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భావిస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న రాజగోపాలరెడ్డి ఈ మధ్యనే పార్టీకి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన ఎంఎల్ఏ ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉపఎన్నికలో పోటీ చేయబోయేది కూడా రాజగోపాలరెడ్డే అనటంలో సందేహం లేదు. ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిషికేషన్ ఇవ్వటమే ఆలస్యం.
తాను కచ్చితంగా గెలవటం కోసం కాంగ్రెస్+టీఆర్ఎస్ పార్టీల్లోని కొందరు నేతలను బీజేపీలోకి లాగేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి లీడర్లను టీఆర్ఎస్ లాగేసుకుంటుంటే అక్కడక్కడ టీడీపీ, టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లాక్కుంటోంది. మొత్తం మీద అన్నీపార్టీల్లోని నేతలకు అన్ని పార్టీలు గాలమేస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే రాజగోపాలరెడ్డి ఓడించటమే ధ్యేయంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. మొదటి టార్గెట్ ఏమో కాంగ్రెస్ గెలుపు. రెండో టార్గెట్ ఏమో కాంగ్రెస్ గెలుపు సాధ్యంకాని పక్షంలో కచ్చితంగా రాజగోపాలరెడ్డి ఓటమే అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని అన్నీ మండలాలకు పార్టీ తరపున రేవంత్ ప్రచార బాధ్యతలు చూసేవారిని నియమించారు. వీరంతా గురువారం నుండి ప్రచారంలోకి దిగబోతున్నారు. అంటే ప్రతిమండలానికి ప్రత్యేకంగా ఒక టీమును రేవంత్ ఏర్పాటుచేశారు.
ఓవరాల్ గా తాను, భువనగిరి ఎంపీ, రాజగోపాలరెడ్డి సోదరుడు అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. వీళ్ళకు అదనంగా జిల్లాలోని నేతలు, ఇతర ప్రాంతాల నేతలను రంగంలోకి కాంగ్రెస్ దింపుతోంది.
ఇవన్నీ సరిపోదన్నట్లు ప్రియాంకాగాంధితో నియోజకవర్గంలో రెండు బహిరంగసభలు కూడా ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకూడా ప్రచారానికి వస్తే ప్రియాంక ఒకసభకే పరిమితమవుతారని తెలుస్తోంది. మొత్తంమీద రాజగోపాలరెడ్డి ఓటమే ధ్యేయంగా కాంగ్రెస్ గట్టిగానే పావులు కదుపుతోంది. అందుకనే చివరకు ఫలితం ఎలాగుంటుందో ఏమో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.