కరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రెడిట్ చైనా సొంతమైంది. ఎంతకూ లొంగని వైరస్ కారణంగా చైనా తొలి బాధితురాలిగా మారినా..కొద్దిరోజులుగా యావత్ ప్రపంచాన్ని బాధితురాలిగా చేయటంలో మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు. ప్రపంచానికే పెను ప్రమాదంగా మారే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా.. వైరస్ వ్యాప్తి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా.. విదేశాలకు వెళ్లకుండా చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు. కఠినమైన నిబంధనల్ని అమలు చేయటం ద్వారా కరోనా వైరస్ ను ఎలా కంట్రోల్ చేయొచ్చన్న విషయాన్ని చైనా చేతల్లో చేసి చూపించింది.
ఇటీవల కాలంలో కొత్త కేసులు నమోదు కాలేదన్న సంతోషంలో ఉన్న డ్రాగన్ దేశానికి అప్పుడప్పుడు నమోదవుతున్న కరోనా కేసులు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చైనాకు కొత్త సమస్య వచ్చి పడిందట. ఆ దేశ ఈశాన్య ప్రాంతాల నుంచి రష్యా నుంచి వచ్చే అక్రమవలసదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుందట.
దీంతో.. అలా అక్రమంగా దేశంలోకిఎంటర్ అవుతున్న వారిని గుర్తించే విషయంలో చైనా కిందామీదా పడుతుందట. రష్యా నుంచి అక్రమంగా వచ్చే వారి కారణంగా కొత్త సమస్యలు వచ్చి పడతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. సరిహద్దుల్లో ఎంత నిఘా పెట్టినా.. అక్రమంగా ప్రవేశించే వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో.. ఇలాంటి వారిని గుర్తించేందుకు కొత్త స్కీంను ప్రకటించారు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి వివరాలు తెలిపినా.. వారిని పట్టించిన ఒక్కొక్కరికి రూ.54వేల మొత్తాన్ని నజరానాగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరీ.. తాయిలం అక్రమవలసల్ని అడ్డుకునేలా చేస్తుందా? అన్నది చూడాలి.