కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని భయంతో వణికి పోయేలా చేస్తున్న అత్యంత భయంకరమైన మహమ్మారి. ఈ మహమ్మారి దెబ్బకి యావత్ ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇక మన దేశంలో ఇప్పటి వరకు 29,451 మందికి కరోనా సోకగా .. 939 మంది కరోనా భారిన పడి మరణించారు. ఇకపోతే తెలంగాణలో ఇప్పటివరకు 1003 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ..332 మంది కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు. 25 మంది కరోనాతో చనిపోయారు.
ఇకపోతే ఒకరకంగా దేశంలో కరోనా మహమ్మారి ఈ లెవెల్ విజృంభించడానికి కారణం ఢిల్లీ మర్కజ్ ఘటనే. ఢిల్లీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత దేశంలో ..రాష్ట్రంలో కూడా కరోనా భాదితుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చారు. అయితే , పరిస్థితిని ముందే ఉహించి న ప్రభుత్వం లాక్ డౌన్ ను కట్టుదిట్టం చేయడం తో పాటుగా ఎక్కడిక్కడ కంటోన్మెంట్స్ జోన్స్ ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చాలావరకు అడ్డుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన చాలా కేసులు కూడా ఢిల్లీ మర్కజ్ ఘటన తో లింక్ ఉన్నవారే. కానీ , తాజాగా గత వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులన్నీ కూడా మర్కజ్ లింకులతో సంబంధం లేనివారు.
దీనితో గ్రేటర్ లో కరోనా పాజిటివ్ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారుల్లో కూడా కరోనా లక్షణాలు కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ కేసుల మూలాలు ట్రేస్ కాక పోవడం తో ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితి అధికారుల్లో ఏర్పడింది. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ల పరిధిలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ..ఇప్పటి వరకు గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రైమరీ కాంటాక్ట్‌లకు మినహా సెకండరీ, థర్డ్ కాంటాక్ట్‌లకు టెస్టులు నిలిపి వేయడం, గ్రీన్‌జోన్ల పరిధిలో కొత్త్త కేసులు వెలుగు చూస్తుండటం..వాటి మూలాల గుర్తింపు వైద్య ఆరోగ్య శాఖకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ 27 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 540 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 151 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 18 మంది మృతి చెందగా, ప్రస్తుతం 371 మంది గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.
రామంతాపూర్‌లోని శ్రీరమణపురం చర్చి కాలనికి చెందిన కిరాణా వ్యాపారి(53)కి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ద్వారా ఆయన భార్య(48)కి వైరస్ సోకింది. ఎవరి ద్వారా వీరికి వైరస్ సోకిందో తెలియడంలేదు. అలాగే ముషీరాబాద్ లోని ఓ మహిళకు ఈ నెల 14న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె ద్వారా కుమారునికి వైరస్ సోకింది. ఐదు రోజుల తర్వాత బేగంబజార్ లో ఉన్న ఆమె కుమార్తెకు, మనవరాలికి, ఆ తర్వాత ఆమె సోదరునికి వైరస్ వ్యాపించింది. ఆమె వల్ల 50 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎన్నారై, మర్కజ్ కేసులతో ఎలాంటి సంబంధాలు కూడా లేవు. కానీ ఆమెకు ఎలా వైరస్ సోకిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇలాగే గ్రేటర్ పరిధిలో కరోనా ఎలా సోకిందో ..దాని మూలం ఎక్కడ ఉందొ అర్థం కానీ కేసులు చాలా ఉన్నాయి. ఎన్నారై.. మర్కజ్ లింకులు లేక పోయినా వైరస్ సోకిన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనితో ఇప్పటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి అని సంతోష పడి లాక్ డౌన్ ఎత్తేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఎలా వ్యాధి మూలాలు దొరకడం లేదు కాబట్టి ..ర్యాపిడ్ టెస్టులు అయినా చేయాలి ..లేకపోతే ఒకరికి కరోనా ఉన్నా కూడా మళ్లీ అందరికి చుట్టుకునే అవకాశం ఉంది.