రాష్ట్రంలోనే టాప్‌: నెలలో క‌ర్నూలు లో క‌దం తొక్కిన క‌రోనా

Update: 2020-04-28 15:30 GMT
ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కావ‌డం లేదు. నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ క‌రోనాను క‌ట్ట‌డి తీసుకురావ‌డానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంబంధిత అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేస్తూ.. క‌రోనాపై చాలారోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చి రాష్ట్రంలో ప‌రిస్థితిని వివ‌రించారు. అద‌లా ఉంటే క‌రోనా కాటుకు మాత్రం క‌ర్నూలు జిల్లా గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఆ జిల్లా కేసుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ టాప్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలో కేసులు 332కు చేరాయి. అయితే క‌రోనా క‌ర్నూలు జిల్లాలో తొలి కేసు వెలుగులోకి వ‌చ్చి నెల రోజులైంది.

మార్చి 28వ తేదీన క‌ర్నూలు జిల్లాలోని నొస్సంలో తొలి కేసు నమోదైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌రకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నొస్సం కేసు తరువాత ప్రైవేట్‌ వైద్యుడి మరణం, ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌, ఏడుగురు వైద్యులకు పాజిటివ్‌, ఓ వార్డు వలంటీరు పాజిటివ్ ఇలా క‌ర్నూలు జిల్లాలో కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి. అసాధారణ స్థాయిలో ఈ జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. ఇంత‌కుముందు గుంటూరు జిల్లా మొద‌టి స్థానంలో ఉండేది. గుంటూరును దాటేసి కేసుల్లో ప్ర‌థ‌మ స్థానం క‌ర్నూలు నిలుస్తోంది.

15 రోజుల్లోనే 200కు పైగా కేసులు క‌ర్నూలు జిల్లాలో న‌మోద‌య్యాయి. రోజుకు సగటున సుమారు పది కేసులు నమోదవుతున్నాయి. తొలి కేసు త‌ర్వాత వారానికే జిల్లాలో 50 కేసులు రాగా, ఆ తర్వాత 10 రోజుల్లో కేసుల‌ సంఖ్య 100కు చేరింది. ప్రైవేటు వైద్యుడి మరణం త‌ర్వాత జిల్లాలో దారుణంగా కేసులు పెర‌గ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. వారం రోజుల్లో ఏకంగా 130కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా జిల్లాలో కరోనా పాజిటివ్‌ తో తొమ్మిది మంది మరణించారు.

ఈ విధంగా క‌ర్నూలు జిల్లా  కేసు న‌మోదులో ముందంజ‌ లో ఉండ‌డం తో జిల్లా ప్ర‌జ‌లు, జిల్లా అధికార యంత్రాంగం భ‌యాందోళన చెందుతోంది. క‌రోనా నివార‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌ట్ట‌డి కాక‌ పోవ‌డంతో ఉన్న‌తాధికారులు రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News