ఏపీలో మూడేళ్ల నాడు అధికారం చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంకో రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. తాను సీఎంగా పదవీ ప్రమాణం చేపట్టిననాడే... ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే పాలన సాగిస్తున్న చంద్రబాబు... ఇప్పటిదాకా తన కేబినెట్ ను రీషఫిల్ చేసిన దాఖలా లేదు. ఎప్పటికప్పుడు అదుగో విస్తరణ - ఇదుగో పునర్వవస్థీకరణ అంటూ తెలుగు తమ్ముళ్లలో హైప్ ను క్రియేట్ చేస్తున్న చంద్రబాబు... ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు వేయలేకపోయారు. ఈ క్రమంలో పదవీ బాధ్యతలు చేపట్టిననాడు ఎవరైతే ఉన్నారో... వారితోనే చంద్రబాబు పని కానిచ్చేస్తున్నారు. మంత్రులేమీ మారని నేపథ్యంలో పాలనలోనూ ఏమాత్రం కొత్తదనం గానీ, కొత్త పథకాల రంగప్రవేశం గానీ ఏమీ లేకుండానే సాగుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
పాలన ఎలా ఉన్నా... రాజధాని కూడా లేకుండా 13 జిల్లాలతో ఓ ముక్కగా ఏర్పడ్డ నవ్యాంధ్రను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు శ్రమిస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు... ఆ దిశగా చేపడుతున్న ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేసుకోకుండా వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఒకే అంశంపై రెండు రకాల ప్రకటనలు ప్రభుత్వం నుంచి వెలువడుతున్న సందర్భాలు కూడా కోకొల్లలుగానే ఉన్నాయన్న వాదన కూడా లేకపోలేదు. ఇక ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రచారం మరింత పెరిగిందనే చెప్పాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ... వాస్తవాలకు విరుద్ధమైన విషయాలను గొప్పలుగా చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబు సర్కారుపై విపక్ష వైసీపీతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయినా చంద్రబాబు సర్కారుకు పెట్టిన కొత్త పేరేమిటన్న విషయానికి వస్తే.. గ్రాఫిక్స్ గవర్నమెంట్. ఈ పేరే ఎందుకు? ఎవరు పెట్టారన్న అంశానికి వస్తే... 2017-18 ఏడాదికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్, దాని వెంటే సభ ముందుకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక సర్వేలపై జనం, ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలించే క్రిటిక్స్ ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే... చంద్రబాబు సర్కారుకు వారంతా ఓ కొత్త పేరే పెట్టేశారు. బడ్జెట్ మొత్తాన్ని వాస్తవ విరుద్ధంగా రూపొందించారని, అంతేకాకుండా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాల్సిన ఆర్థిక సర్వేను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంతో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబు సర్కారుకు వారు గ్రాఫిక్స్ గవర్నమెంట్ అని కొత్త పేరు పెట్టేసి... అదే పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని పిలుస్తున్న వైనం కూడా మనకు స్పష్టంగానే కనిపిస్తోంది. మరి జనం, క్రిటిక్స్ పెట్టిన కొత్త పేరుపై బాబు అండ్ కో ఏమంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/