గతకొన్ని రోజులుగా ఇండియాని వణికిస్తోన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. గత రెండు , మూడు రోజులుగా కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మంచి శుభపరిణామం. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే మరణాలు మాత్రం ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 3 ,128 మంది చనిపోగా.. యాక్టివ్ కేసులు 20 లక్షల 26వేలకు తగ్గాయి.
తాజా వివరాలతో కలిపి .. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,56,92,342కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,29,100కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 21,31,54,129కు చేరుకున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా బలహీనపడుతోంది. కొత్త కేసులు నిరంతరం తగ్గుతుండగా , రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొంచెం కొంచెంగా సడలించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా దేశంలో రికవరీరేటు 91.25 శాతానికి పెరిగింది. ఇక , తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,48,66,883 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,83,135 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.