రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారంతా విజయాలు దక్కించుకుంటారని ఎప్పుడూ చెప్పలేం. అలానే.. రికార్డులు తిరగరాయకుండా ఉంటారని కూడా అనలేం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అదే జరిగింది. మామను మించిన కోడలుగా.. డింపుల్ యాదవ్ రికార్డు సృష్టించింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నాయకుడు.. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మృతి చెందారు.
దీంతో ములాయం ప్రాతినిధ్యం వహించిన 'మెయిన్‌పురి' నియోజకర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఆయన కోడలు, మాజీ సీఎం అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే.. ఆమె సాధారణ విజయం దక్కించుకోలేదు. మామను మించిన మెజారిటీతో గెలుపొందారు. మెయిన్పురి లోక్సభ నియోజకవర్గంలో డింపుల్ యాదవ్ 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
నిజానికి ఇది సానుభూతి ఎన్నికగానే పరిగణించాలి. ఎందుకంటే.. ములాయం ఈ స్థానం నుంచి 2019లో విజయం దక్కించుకున్నారు. అయితే, ఇటీవల ఆయన మృతి చెందారు. దీంతో ఉప పోరు వచ్చింది. అయితే.. సాదారణంగా ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికే టికెట్ ఇచ్చి.. అందరూ పోటీకి దూరంగా ఉంటారు. కానీ, బీజేపీ మాత్రం రఘురాజ్ సింగ్ షాక్యా ను నిలబెట్టింది.
2019 ఎన్నికల్లో ములాయం 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్పై గెలుపొందారు. ఇప్పుడు డింపుల్కు రెండు లక్షలకు పైగా మెజార్టీ లభించింది. దీంతో బీజేపీ శిబిరం చిన్నపోగా, ఎస్పీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు.. ఈ నియోజకవర్గంలో పాగా వేయాలని భావించిన బీజేపీ నాయకుడు, యూపీ సీఎం యోగికి ఇది. పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.