ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ పెట్టి కోట్లలో టోకరా వేసిన వైనం విస్తుగొలిపేలా ఉంది. ‘మోసగాళ్లు’ సినిమాలో చేసినట్టు ఎవ్వరికీ అనుమానం రాకుండా పద్ధతిగా చేసి కోట్లు కొల్లగొట్టేశారు. ఈ నకిలీ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేసి అక్కడ పరిస్థితి చూసి షాక్ అయిన పరిస్థితి నెలకొంది.
పశ్చిమ ఢిల్లీలోని హరినగర్ లో నకిలీ కాల్ సెంటర్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. అమెరికన్ ప్రభుత్వ అధికారులుగా నమ్మించి అమెరికన్లను వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ను రద్దు చేస్తామని డబ్బు దండుకుంటున్న 65 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాల్ సెంటర్ యజమానులు లఖన్ జగ్వానీ, విజేందర్ సింగ్ రావత్ లను కూడా అరెస్ట్ చేశఆమని పోలీసులు తెలిపారు. అడ్డదారుల్లో అమెరికన్ పౌరుల వివరాలను రాబట్టే వీరు.. చట్టపరమైన చర్యల నుంచి కాపాడుతామని చెబుతూ డబ్బు గుంజేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ నకిలీ కాల్ సెంటర్ ద్వారా రూ.కోట్లలో వీరు మోసం చేశారని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ గోయల్ తెలిపారు. ఈ విషయంపై అమెరికన్ కస్టమ్స్ శాఖ, డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ, షెరీష్, ఎఫ్బీఐ, యూఎస్ఏ ట్రెజరీ ఆఫీస్ అధికారులమని చెబుతూ అమెరికన్ పౌరులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు.
హరినగర్ లోని కాల్ సెంటర్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడ పలువురు సిబ్బంది ఏకంగా అంతర్జాతీయ కాల్స్ చేస్తూ ఇదే మోసం చేసే పనిలో బిజీగా ఉండడం చూసి పోలీసులే అవాక్కైన పరిస్థితి నెలకొంది. ఇంత ఢిల్లీ నడిబొడ్డున ఇంత విచ్చలవిడిగా ధైర్యంగా చేస్తున్న ఈ నకిలీ రాకెట్ గుట్టును పోలీసులు చేధించి విచారణ జరుపుతున్నారు. దీనివెనుక జరిగిన మోసాలను తవ్వితీస్తున్నారు.