పోలీసులకు 4 వేల టి20 మ్యాచ్ పాస్ లు కావాలట.. హెచ్ సీఏకు తలనొప్పి.. సీపీ సాబ్ చూస్తున్నారా?
ఇద్దామంటే తక్కువ సంఖ్య కాదాయె.. పోనీ లేవందామంటే.. పోలీసులతో పనాయె..? దీంతో ఏమీ చేయలేక తలపట్టుకుంటోంది హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ). లేకలేక మూడేళ్లకు ఓ అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం దక్కిందనుకుంటే ఏమిటీ గోల అని గుండెలు బాదుకుంటోంది. ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతోంది. ఇంతకూ విషయం ఏమిటంటే.. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్ లో పర్యటిస్తోంది. ఈ నెల 20, 23, 25 తేదీల్లో మూడు మ్యాచ్ లు ఆడనుంది. మొదటి మ్యాచ్ పంజాబ్ మొహాలీలోని ఇందర్జీత్ సింగ్ బింద్రా స్టేడియంలో, రెండో మ్యాచ్ నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఇక మూడో మ్యాచ్ మన హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూసేందుకు డిమాండ్ ఏర్పడింది.
అప్పుడు తర్వాత ఇప్పుడే
ఉప్పల్ స్టేడియంలో 2019 డిసెంబరు 6 తర్వాత టి20 మ్యాచ్ ఇప్పుడే. అప్పటికి కొవిడ్ ప్రభావం లేకపోవడంతో బీసీసీఐ మైదానాల షెడ్యూల్ లో ఉప్పల్ స్టేడియం ఉంది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. నాడు జరిగింది కూడా టి20నే. ఇక 2020, 2021, 2022 ఐపీఎల్ సీజన్లలో హైదరాబాద్ కు ఆతిథ్య భాగ్యం దక్కలేదు. 2020లో టోర్నీ పూర్తిగా దుబాయ్ కు వెళ్లిపోగా, 2021లో సగం నుంచి మళ్లిపోయింది. గత సీజన్లో నాలుగు వేదికల్లోనే నిర్వహించారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతుండటంతో కాంప్లిమెంటరీ పాసుల కోసం తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. అదికూడా టి20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో కావడంతో మరింత డిమాండ్ నెలకొంది.
పోలీసులతో వచ్చిన పనాయె??
అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి పోలీసు భద్రత అసాధారణంగా ఉంటుంది. ప్రేక్షకుల ఆదరణకు తగ్గట్లే పోలీసుల ఏర్పాట్లు, హడావుడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వారిని కాదనలేని పరిస్థితి. అయితే, భద్రత కల్పించాల్సిన పోలీసుల నుంచి పాసుల కోసం డిమాండ్లు ఊహించని స్థాయిలో ఉన్నాయి. ఏకంగా తమకు 4 వేల పాసులు కావాలంటూ వారు పట్టుబడుతున్నారు. దీంతో హెచ్‌సీఏ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రేక్షకుల నుంచి కూడా ఈ మ్యాచ్ కు విశేష స్పందన వచ్చింది. గురువారం రాత్రి 8 గంటలకు పేటీఎంలో టిక్కెట్ల విక్రయం మొదలుపెట్టారు. చిటికెలో 39 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఉప్పల్ నుంచి రాచకొండ వరకు
ఉప్పల్ స్టేడియం పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ వారి నుంచి రాచకొండ కమిషనరేట్ లోని అధికారుల వరకు తమకు పాస్ లు కావాలంటూ హెచ్ సీఏను ఒత్తిడి చేస్తున్నారు. వీరిలో వివిధ హోదాల వారు ఉండడం గమనార్హం. కొందరు లెటర్లు పంపడం చేయగా.. మరికొందరు ఫోన్లోనే అడిగేస్తున్నారు. సహజంగా హెచ్ సీఏ తరఫున మ్యాచ్ జరిగే సమయంలో పోలీసులకు పాస్ లు ఇస్తుంటారు.
దీనికి అదనంగా డబ్బు కూడా రూ.లక్షలో ఇస్తుంటారు. కానీ, ఈ సారి డిమాండ్లు అధికంగా ఉండడంతో ఏమి చేయాలో హెచ్ సీఏ వారికి తెలియడం లేదు. ఇవి కాక ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయం, ఇతర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు అడిగే పాసులు సరేసరి. వీళ్లందరికీ ఇవ్వాలంటే 10 వేల పాసులు కావాలి. కాగా, ఉప్పల్ లో మ్యాచ్‌కు ఇంకా వారం సమయం ఉంది. మ్యాచ్ నాటికి ఇంకెంతమంది పాసుల కోసం ఒత్తడిచేస్తారో..?
సీపీ సాబ్ చూస్తున్నారా?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ క్రికెట్ వీరాభిమాని. ఆయన కుమారుడు సీవీ మిలింద్ రంజీ ప్లేయర్ కూడా. మరి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరుగుతున్న డిమాండ్ ను ఆయన చూస్తున్నారో లేదో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.