తాము అభిమానించి.. ఆరాధించే ముఖ్యనేతలు ఆసుపత్రిలో చేరారన్న మాట వింటేనే ఆందోళనకు గురి అవుతున్నారు తమిళ ప్రజలు. గడిచిన కొద్ది నెలల వ్యవధిలోనే ఇద్దరు మేరు నగం లాంటి అధినేతల్ని ఆనారోగ్యం కారణంగా శాశ్వితంగా దూరం చేసుకున్న తమిళ ప్రజలు.. ముఖ్యనేతలకు అనారోగ్యం అన్నా.. ఆసుపత్రిలో చేరారన్నా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.
తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని.. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తోంది. స్టాలిన్ కుడి తొడలో సిస్ట్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం (శుక్రవారం) ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతానికి స్టాలిన్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మూత్ర పిండాల ఇన్ ఫెక్షన్ కు సంబంధించి కూడా చికిత్స చేసినట్లుగా చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని.. ఆయన బాగున్నారని వైద్యులు చెబుతున్నారు.