స్టింగ్ ఆప‌రేష‌న్ క‌ల‌క‌లం..స్టాలిన్ అరెస్టు

Update: 2017-06-14 11:28 GMT
తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొద‌టిరోజే హాట్‌ హాట్‌ గా సాగాయి. అన్నాడీఎంకే లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ తమ డిమాండ్ ను అనుమతించకపోవడంతో అసెంబ్లీ బయట బైఠాయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై  అసెంబ్లీలో చర్చకు అనుమతించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కాగా డీఎంకే సభ్యుల వ్యవహార శైలిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తా పత్రికలు, టెలివిజన్లలో వచ్చిన వార్తలపై చర్చకు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పారు. స్పష్టమైన ఆధారాలుంటూ సభ ముందుంచాలని స్పీకర్ వారికి సూచించారు. ఈ దశలో డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యలు అసెంబ్లీ బయటకు వచ్చి అక్కడ బైఠాయించారు.

విశ్వాస‌పరీక్ష‌లో ప‌ళ‌నిస్వామికి ఓటేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు లంచం ఇవ్వ‌చూపార‌ని వ‌చ్చిన స్టింగ్ ఆప‌రేష‌న్ వీడియో ఘ‌ట‌న‌ను లేవ‌నెత్తుతూ స్టాలిన్ స‌హా స‌భ్యులు అసెంబ్లీలో నినాదాలు చేశారు. ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాకు దిగిన డీఎంకే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ తో పాటు ఇత‌ర ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ స‌స్పెండ్ చేశారు. అనంత‌రం వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ స్టింగ్ ఆప‌రేష‌న్‌ పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని స్టాలిన్ డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News