రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య మరో రాష్ట్రంలో గొడవ మొదలైందా ? తమిళనాడు అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తమిళనాడులోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకాలను ఇకనుండి ప్రభుత్వమే చేస్తుందని తేల్చేసింది. ఇప్పటివరకు వీసీలను గవర్నర్ నేరుగా నియమిస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో పెట్టిన బిల్లు ప్రకారం ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుల ప్రకారమే గవర్నర్ వీసీలను నియమిస్తారు.
చాలా రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్రప్రభుత్వాల ఇష్టప్రకారమే జరుగుతుంది. వీసీ నియామకాలపై ముగ్గురు సభ్యులతో ఫైల్ గవర్నర్ ముందుకు ప్రభుత్వం పంపిస్తుంది. అందులో నుండి గవర్నర్ ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఫైల్ ను ప్రభుత్వానికి పంపుతారు.
ఆ వ్యక్తినే ప్రభుత్వం వీసీగా ప్రకటిస్తుంది. అయితే ఈ పరిస్దితి తమిళనాడులో మారిపోయింది. ప్రభుత్వ అధికారాలను గవర్నర్ వ్యవస్థ తన చేతిలోకి తీసేసుకుంది. అందుకనే అసెంబ్లీలో కొత్తగా ఒక బిల్లు పెట్టి గవర్నర్ అధికారాలకు కత్తెర వేసింది ప్రభుత్వం.
ఇక్కడ విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో లాగే ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య వివాదం మొదలైందన్నది వాస్తవం. ఇప్పటికే తెలంగాణా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ప్రభుత్వాలకు గవర్నర్లకు ఏమాత్రం పడటం లేదన్నది వాస్తవం. పై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గవర్నర్లకు మధ్య వివాదం రోడ్డున పడిపోయింది. బెంగాల్లో అయితే ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి గవర్నర్ జగదీప్ ధనకడ్ కు మధ్య గొడవలు బాగా పెరిగిపోయి ఒకళ్ళకు మరొకళ్ళు రాజకీయ ప్రత్యర్ధుల్లాగ మారిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే ప్రధానంగా సమస్యలు పెరిగిపోతున్నాయి. గవర్నర్లను ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వాలను నడుపుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
రాష్ట్రాల్లో ఏదైనా సంఘటనలు జరగ్గానే గవర్నర్లు తమంతట తాముగా యాక్టివ్ అయిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటమో లేకపోతే అధికారుల నుండి నివేదికలను తెప్పించుకోవటం, చర్యలకు ఆదేశిస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే ముఖ్యమంత్రులకు గవర్నర్లకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి అదనంగానే తమిళనాడులో గవర్నర్ అధికారానికి కత్తెరపడింది.