ర‌జ‌నీ మ‌ళ్లీ అభిమానుల భేటీ ఎందుకు పెట్టాడో

Update: 2017-12-22 12:38 GMT
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్ - రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. కొద్ది రోజులలో కమల్ పార్టీ ప్రకటిస్తానని చెప్పినప్పటికి - రజనీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసిన తలైవా మళ్ళీ ఈ నెలలో మరోసారి ఏర్పాటు చేయనున్నాడట. ఈ వార్త ఇప్పుడు తమిళ నాట సంచలనంగా మారింది.

మేలో తన అభిమానులతో కలిసి ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసిన రజినీకాంత్ డిసెంబర్ 26 నుండి 31 వరకు కోడంబాక్కంలోని రాఘవేంద్ర మ్యారేజ్ హాల్ లో కలవనున్నారట. దీంతో రజినీ పొలికట్ ఎంట్రీపై మళ్ళీ చర్చ జరుగుతుంది. ప్రతి రోజు సుమారు వెయ్యి మంది అభిమానులను కలిసేలా రజినీ ప్లాన్ చేస్తుండగా - 26న కాంచీపురం - తిరువళ్లూర్ - కృష్ణగిరి - ధర్మపురి - నీలగిరి ఫ్యాన్స్‌ ని - 27న తిరువారూర్ - నాగపట్టణం - పుదుకోటైట - రామనాథపురం అభిమానులను - 28న మధురై - నామక్కల్ - సేలమ్‌ ఫ్యాన్స్‌ ను - 29న కోయంబత్తూర్ - ఈరోడ్ - వెల్లూర్‌ ఫ్యాన్స్‌ ను - నార్త్‌ మరియు సెంట్రల్‌ చెన్నై ఫ్యాన్స్‌ ను 30న - సౌత్‌ చెన్నై ఫ్యాన్స్‌ ను 31న కలవనున్నట్టు తెలుస్తుంది.

ఫ్యాన్స్ మీట్ కి హాజరయ్యే అభిమానులు తప్పక ఫ్యాన్స్ క్లబ్ నుండి ఐడీ కార్డ్ తీసుకురావాలని కండీషన్స్ పెట్టారట నిర్వాహకులు. దీంతో పాటు రజనీని కౌగిలించుకోవడం - మధ్యం సేవించి రావడం - కాళ్ల మీద పడటం వంటివి చేయోద్దని ముందుగానే ఇన్‌ స్ట్రక్షన్స్ ఇచ్చారని టాక్. మరి ఈ మీటింగ్ లో అయిన తలైవా పొలికల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News