ముక్కు అవినాష్ కు కేసీఆర్ సర్కారు చేసిన సాయమెంతో తెలుసా?

Update: 2021-03-29 04:41 GMT
తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని బుల్లితెర కమెడియన్లలో ముక్కు అవినాష్ ఒకరు. జబర్ధస్త్ టీంలో ఒకడిగా అతనికి ఉన్న ఇమేజ్ ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత మందికి దగ్గరయ్యాడు. తాజాగా అవినాష్ తల్లి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. తెలంగాణ సర్కారు ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించారు.

దీనికి సంబంధించిన చెక్కును మంత్రిగారు స్వయంగా అవినాష్ కు అందించారు. ఇంతకీ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసిన సాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.60వేలుగా చెబుతున్నారు. ఆమెకు అయిన ఆసుపత్రి బిల్లు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకోగా.. రూ.60వేలు మంజూరు చేశారు. ఇవాల్టి రోజున ఇంత మొత్తానికి అవినాష్ ప్రభుత్వ సాయాన్ని కోరారా? అన్నది ప్రశ్న.

ఒకవేళ సాయం కోరారే అనుకోండి.. సాయాన్ని అందించకుండా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా చెక్కు ఇచ్చేంత హడావుడి అవసరమా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. బుల్లితెర సెలబ్రిటీగా పలువురికి సుపరిచితుడైన అవినాష్ తల్లి ఆసుపత్రుల ఖర్చులకు సీఎం సహాయ నిధిని సాయం అడగటం తప్పు కాకున్నా.. ఇంత చిన్న మొత్తానికి ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం ఏ మాత్రం బాగోలేదని చెప్పక తప్పదు.


Tags:    

Similar News