రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. తన కామెంట్లతో ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను గెలిస్తే భారతీయులను తరిమేస్తానని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇవన్నీ పక్కనపెడితే ట్రంప్ అసలు సంగతేంటన్నది ఆసక్తికరమే. అంతేకాదు... భారత్ విషయంలో ఇలాంటి కామెంట్లు చేస్తున్న ట్రంప్ భారత్ కు దూరంగా ఉంటున్నారా అదీ ఒట్టి మాటే. భారత్ లో బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తున్నారాయన.
ట్రంప్ అమెరికాలో పెద్ద బిలియనీర్. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు ఇండియాలోనూ తన రియల్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ట్రంప్ పెద్దపెద్ద ప్లాన్లే వేస్తున్నారు. అమెరికన్లను మభ్యపెట్టడానికి ఎన్నికల సందర్భంగా ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన ఇండియాలో రియల్ వ్యాపారాన్ని మాత్రం బ్రహ్మాండంగా సాగిస్తున్నారు. అంతేకాదు.... మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.
ట్రంప్ కుమారుడు ఇప్పటికే పుణె - ముంబయిల్లో రెండు భారీ రియల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. పుణెలో రెండు టవర్లలో 46 బ్లాకుల్లో అపార్టుమెంట్లు కడుతున్నారు. ముంబయిలో లోధా గ్రూపుతో కలిసి 300 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఉత్తరాదిలోను - ఈశాన్య రాష్ట్రాల్లోనూ రియల్ ప్రాజెక్టులు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ - బెంగళూరు - చెన్నై - హైదరాబాద్ - పుణెల్లో లగ్జరీ అపార్టుమెంట్ల నిర్మాణానికి ట్రంప్ కుమారుడు పెద్ద ఎత్తున వ్యవహారాలు డీల్ చేస్తున్నారు. వీటితో పాటు హాస్పిటాలిటీ - గోల్ఫ్ కోర్సులు- కాసినోవాల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు జూనియర్ ట్రంప్ రెడీ అవుతున్నారు.
ఇవన్నీ గమనిస్తే ఇండియా ట్రంప్ కు చాలా కీలకమన్న సంగతి అర్థమవుతోంది. ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడైతే ఇండియాతో మంచి సంబంధాలు నెరుపుతారని భావిస్తున్నారు. భారత్ లో మోడీ ప్రధాని అయినప్పుడు ట్రంప్ ఇండియాకు ప్రత్యేకంగా వచ్చి మోడీని అభినందించి వెళ్లిన విషయం మర్చిపోరాదు. భవిష్యత్తులో భారీగా ఇండియాలో పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల కోసం ఎన్ని మాటలు చెప్పినా ఇండియాపై ఆయన కన్నుందని... ఆయన లెక్కలు వేరుగా ఉన్నాయని చెప్పక తప్పదు.