షాకింగ్: చలిలో మద్యం తాగితే ఖతమే

Update: 2020-12-27 10:00 GMT
సాధారణంగా చలి బాగా పెడితే బాడీలో వేడి పుట్టించడానికి చాలా మంది మద్యం తాగుతారు. కానీ ఇలా మద్యం తాగడం వల్ల చలిని తట్టుకోవడం అనేది ఒట్టి భ్రమ అని నిపుణులు చెబుతున్నారు. చలిని తట్టుకునేలా ఒళ్లు వెచ్చబడాలంటే మద్యం సేవించాలన్నది నూటికి నూరు శాతం అబద్దపు ప్రచారం అని కొట్టిపడేస్తున్నారు.

తాజాగా ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. న్యూయర్ మంచి చలికాలంలో వస్తుండడంతో తొలిసారి మందుబాబులకు హెచ్చరికలు జారీ చేసింది. కొత్త ఏడాది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తాజాగా కీలక సూచన చేసింది.

దేశంలో చలితీవ్రత పెరుగుతుండడం.. ఉత్తర భారతం నుంచి ప్రమాదకరమైన అతి శీతల గాలులు వీస్తున్న నేపథ్యంలో మందు బాబులకు వాతావరణ శఆఖ హెచ్చరికలు పంపింది. ఈనెల 28 నుంచి శీతల పవనాల ప్రభావం ఉండనున్నందున చలిలో మద్యం సేవిస్తే శరీర ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని.. కాబట్టి మద్యసేవనం వద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

చలిలో విపరీతమైన మద్యసేవనం ప్రాణాంతకం అని ఓహియో వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. పార్టీ చిన్నదయినా, పెద్దదయినా సరే, మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు..

సోమవారం(డిసెంబర్ 28) నుంచి ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరుగుతుందని, ఆ ప్రభావంతో దేశంలోని మిగతా ప్రాంతాలకూ తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, అందువల్ల ప్రజలెవరూ బయట తిరుగరాదని, కొత్త సంవత్సర వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
Tags:    

Similar News