సింఫుల్ గా తీసి పారేస్తాం కానీ కాపీ కొట్టటం కూడా కళే. ఒకరిని కాపీ కొట్టాలన్న ఆతృత మాత్రమే ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ కళ కూడా అవసరం. ఆ విషయాన్ని నెదర్లాండ్స్ ప్రధాని ఇప్పటికైనా తెలుసుకుంటారేమో. తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఆయన నెదర్లాండ్స్ కు వెళ్లారు.
ఏ దేశానికి వెళుతున్నా.. అక్కడి ప్రజల్ని ఉద్దేశించి.. స్థానిక భాషలో ట్విట్టర్లో ట్వీట్లు పెట్టటం మోడీకి అలవాటే. ఇలాంటి పోస్టులన్నీ మోడీ పెట్టకున్నా.. ఆయన దగ్గర ఉన్న కత్తుల్లాంటి సోషల్ మీడియా కుర్రాళ్లు ట్వీట్లు సిద్ధం చేసేస్తుంటారు. అదే విధానాన్ని తన నెదర్లాండ్స్ ట్రిప్ లోనూ మోడీ కంటిన్యూ చేశారు.
తన నెదర్లాండ్ ట్రిప్ లో డచ్ భాషలో పలు ట్వీట్లు చేయటం ద్వారా.. అక్కడి ప్రజల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. మోడీ ట్వీట్ల సమ్మోహనాస్త్రాన్ని కాపీ కొట్టాలని భావించినట్లున్నారు నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే. ఆయన కూడా హిందీలో.. ట్వీట్ చేశారు. అయితే.. కాపీ కొట్టే హడావుడిలో హిందీ పదాలకు మధ్యన గ్యాప్ ఇవ్వకపోవటంతో అన్ని పదాలు కలిసిపోయాయి. దీంతో ఆ ప్రధాని ఏం చెప్పాలనుకున్నారో ఓపట్టాన అర్థం కాని పరిస్థితి.
దీంతో..ట్వీట్లతో ప్రశంసలు పొందాల్సిన స్థానే విమర్శల్ని మూటగట్టుకున్నారు నెదర్లాండ్స్ ప్రధాని. ఎక్కడా స్పేస్ లు ఇవ్వకుండా రాయటం ఏమిటంటూ పలువురు ప్రశ్నించారు. మరికొందరు పనిలో పనిగా ఎటకారం చేసేసుకున్నారు. మోడీని కాపీ కొట్టేసి మార్కులు తెచ్చుకుందామనుకున్న నెదర్లాండ్స్ ప్రధాని ప్రయత్నం ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/