టీఆర్ఎస్ నుంచి వాళ్లే పంపించాలని ఈటల చూస్తున్నారు. ఆయనే వెళ్లిపోయేలా చేయాలని చూస్తున్నట్టుంది అధిష్టానం. ఇప్పటి వరకైతే టెక్నికల్ గా ఈటల టీఆర్ఎస్ నేతే. కానీ.. పోరు మాత్రం ప్రత్యర్థులుగా భీకరంగా సాగుతోంది. హుజూరాబాద్ నుంచి నాన్ గులాబీ నేతగా రాష్ట్రస్థాయి లీడర్ గా ఎదిగేందుకు ఈటల ప్రయత్నిస్తుంటే.. ఆయన నియోజకవర్గంలోనే పట్టుతప్పించాలని చూస్తోంది గులాబీ దళం.
ఇప్పటికే నియోజకవర్గ పార్టీ పగ్గాలు లక్ష్మీకాంతారావుకు అప్పగించినట్టు సమాచారం. మరో మినిస్టర్ గంగుల కమలాకర్ రెడ్డి ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ సూచనల మేరకు ముందుకు సాగుతున్న మంత్రి.. ఈటలకు ధీటుగా కౌశిక్ రెడ్డిని తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. కౌశిక్ రెడ్డి గతంలో ఈటలపై పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు గులాబీ తీర్థం పట్టించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, నియోజకవర్గంలో దాదాపు తొంభై శాతం మంది ప్రజాప్రతినిధులు ఈటలకు సంఘీభావం ప్రకటించారు. పలువురు ఉద్యమకారులు, ఇతర పార్టీల నేతలు ఈటలతో టచ్ లోకి వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈటల సొంత పార్టీ పెట్టడం ఖాయం అనే ప్రచారం మరింత బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా పావులు కదుపుతున్న అధిష్టానం.. ఈటలను సొంత నియోజకవర్గంలో బలహీన పర్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
అధిష్టానం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గంగుల.. ఈటలకు మద్దతు పలికిన నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అధికారంలో ఉన్న పార్టీని కాదని, ఈటలతోవెళ్తే ఒరిగేది ఏమీ ఉండదని చెబుతున్నారట. రాజకీయ భవిష్యత్ అటూ ఇటూ కాకుండా.. రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని నచ్చజెపుతున్నారట.
అటు కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి ఈటలపై దాడిచేయిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల బినామీ పేర్లతో భూములు కొన్నారని తాజాగా ఆరోపణలు చేశారు కౌశిక్. మరో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా ఈటలపై ముప్పేట దాడి కొనసాగించే వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి, వీటిని ఈటల ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.