ప్రైవసీ మీద ప్రపంచ వ్యాప్తం గా ఆందోళనలు అంత కంతకూ ఎక్కువ అవుతున్నాయి. పెరుగుతున్న సాంకేతికత.. అంత కంతకూ విస్తరిస్తున్న సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎవరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఎలా ఉంటారు? లాంటి అంశాల కు సంబంధించిన వివరాలు తెలుసు కోవటం ఇవాల్టి రోజున అందుబాటు లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద కష్టమైన పని కాదు. ఇక.. ఫేస్ బుక్ లాంటి సంస్థ దాదాపు పదకొండేళ్లు గా అందిస్తున్న కొన్ని సేవల పై వస్తున్న విమర్శలు.. ఆందోళనల కు తాజాగా స్పందించింది. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అందించే కీలకమైన సేవను బంద్ చేస్తున్నట్లు గా ప్రకటించి సంచలనం గా మారింది.
ఫేస్ బుక్ లో ఫేషియల్ రికగ్రైషన్.. ఫేస్ ప్రింటర్లు అందుబాటు లో ఉండే విషయం తెలిసిందే. ప్రైవసీ మీద పెరుగుతున్న ఆందోళన నేపథ్యం లో.. ఈ సేవల్ని తొలగించటానికి వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఫేషియల్ రికగ్రైషన్ టెక్నాలజీ లో ఇదో భారీ మార్పు గా ఫేస్ బుక్ మదర్ ఆర్గ నైజేషన్ ‘మెటా’ పేర్కొంది. అందరూ వినియోగించే స్థాయి నుంచి పరిమిత వినియోగానికి కుదించేందుకు వీలు గా తాము అందిస్తున్న ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ ని తాము తొలగిస్తున్నామని.. ప్రస్తుతం ఫేస్ బుక్ లోఈ సర్వీసు ను వినియోగించుకుంటున్న వారు ఇక పై ఆ సేవల్ని పొందలేరని స్పష్టం చేసింది.
రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనల నేపథ్యం లో తామీ సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని 2010 లో అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఫేస్ బుక్ యూజర్ల లో మూడొంతుల మంది ఫేషియల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ని తీసేయటం ద్వారా ప్రపంచ వ్యాప్తం గా ఫేస్ బుక్ వినియోగదారుల్లో ఒక బిలియన్ (10కోట్లు) మంది ప్రభావితం కాబోతున్నారు. అన్నింటి కి మించి కంటి చూపు లోపం ఉన్న వారికి ఆటోమేటిక్ ఆల్ట్ టెక్ట్స్ పై దీని ప్రభావం పడనుంది.
ఇకపై.. ఫేస్ బుక్ వీడియోలు.. ఫోటోల్లోని ముఖాలను గుర్తించటం అనేది ఉండదు. ఫోటోల్లోని వ్యక్తిని గుర్తించేందుకు వారి పేరుతో ట్యాగ్ చేయటానికి గుర్తించే వీలు ఉండదు. ప్రైవసీ విషయంలో తరచూ టార్గెట్ అవుతున్న ఫేస్ బుక్.. విమర్శలతో పాటు న్యాయపరమైన సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఎన్నో దేశాల్లో కోర్టు కేసుల్లో చిక్కుకుంటోంది. ఇటీవల ఫేస్ బుక్ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు సంస్థకు చెందిన డాక్యుమెంట్లను లీక్ చేయటంతో ‘మెటా’కు బోలెడన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఇలాంటివేళ.. గతానికి భిన్నంగా ప్రైవసీ విషయంలో తాము పెద్దపీట వేస్తామన్న భావన కలిగేలా తాజా నిర్ణయం ఉందని చెప్పక తప్పదు.