సోషల్ నెట్ వర్క్స్ వల్ల ప్రయోజనం ఎంతో ఇబ్బందులూ అంతే ఉన్నాయని వాటిని ఫేస్ చేసిన వారు చెప్పే విషయం. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అంటే ఎవరైనా, ఏ విషయంపై అయినా వివాదాలకు తావులేకుండా తమ అభిప్రాయాలను పంచుకునే వేదిక అనేది మరికొందరి అభిప్రాయం. ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే... ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ - ట్విట్టర్ వంటి సోషల్ నేట్ వర్కింగ్ సైట్స్ వదంతులకు అడ్డాలుగా మారుతున్నాయనే చెప్పాలి. సంచలనం కోసమో, ఆకతాయి తనమో లేక వ్యక్తిగత కక్షల్లో భాగమో కానీ... కొంతమంది ఈ ఆన్ లైన్ వేదికగా చేస్తోన్న రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు!
తాజాగా తమిళనాడులో ఇలాంటి రచ్చే జరుగుతుంది. జయలలిత మరణించి ఇప్పటికే ఐదురోజులైంది.. జయలలిత ఆరోగ్యం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది.. జయలలిత బ్రతికే అవకాశాలు లేవు.. అందుకే జాతీయ నేతలంతా వచ్చి చూసి వెళ్తున్నారు.. ఇలా రకరకాల గాసిప్పులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. తమిళనాడులో జయలలిత ఆరోగ్యం అనే విషయం ఎంత సున్నితమైంది, దానివల్ల జరిగే పరిణామాలు అంచనా వేయలేని కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారనే అనుకోవాలి. దీనిపై ఇప్పటికే అన్నాడీఎంకే ఐటీ సెల్ కూడా ఏర్పాటు చేసుకుందనుకోండి!
ఇదే క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గురించి వదంతులు రావడం మొదలయ్యాయి. కావాలనే చేశారా లేక అమ్మపై వస్తోన్న ఆరోపణల్లో కరుణ కు కూడా భాగముందని భావించి కక్ష తీర్చుకునే సందర్భంలో చేశారా అనే విషయాలు పక్కనపెడితే... ఫేస్ బుక్ లో ‘అమ్మా సింగం సవితా’ ఐడీలో "గుండెపోటుతో కరుణానిధి మృతి" అని పోస్ట్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ తమిళనాడులోని డీఎంకే కార్యకర్తల్లో అలజడి సృష్టించింది. అయితే ఈ విషయంపై సీరియస్ గా స్పందించిన డీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరైతే కరుణానిధిపై వదంతులు సృష్టించిన సవితాపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్ ముందు నిరసనలకు దిగారు. అయితే ఈ విషయాలపై స్పందిస్తోన్న పోలీసులు మాత్రం... జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న పలువురిని అరెస్టు చేస్తున్నాం... అదే విధంగా కరుణానిధిపై వదంతులు సృష్టిస్తున్న వారిని కూడా అరెస్టుచేస్తామని చెప్పారట!
ఈ రేంజ్ లో తమిళనాడులో డీఎంకే - అన్నాడీఎంకే ల మధ్య సోషల్ వార్ నడుస్తోందని చెప్పుకోవాలి!! ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదని, ఈ విషయంలో పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, పోస్టులు చేసేవారు కూడా ఆ పోస్ట్ లు పెట్టేముందు ఒక్క నిమిషం తదనంతర పరిణామాల గురించి కూడా ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/