రోజురోజుకు మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి.. మానవత్వం మంటగలుస్తోంది. కామం.. తాగిన మైకం.. వంటి మధ్య వావివరుసలు మరచిపోతున్నారు. ఈ క్రమంలోనే సొంత కుటుంబసభ్యులపైనే లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. ఆ ఘటనలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. తాజాగా ఓ తండ్రి కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడితో పాటు అతడి తండ్రి అంటే తాత కూడా ఆ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ బాలిక గర్భవతి అయ్యింది. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఈ ఘటన కలచివేస్తోంది.
తమిళనాడులోని తంజావురుకు చెందిన బాలికకు తండ్రి.. తాత ఉన్నాడు. ఆమె తల్లి గతంలోనే మరణించింది. తల్లి మరణించినప్పటి నుంచి తండ్రి, తాత ఆమెను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలికపై సొంత తండ్రితో పాటు తాత కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఆ బాలిక శరీరంలో వచ్చిన మార్పులతో వెలుగులోకి వచ్చింది. వారి వలన ఆ బాలిక ఇప్పుడు గర్భవతి. ఈ ఉదంతం తెలుసుకున్న బాలిక అత్త న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వావివరుసలు మరచి తన కోడలుపై అత్యాచారానికి పాల్పడుతున్న ఆమె తాత, తండ్రిని అరెస్ట్ చేయాలని కోర్టుకు ఆశ్రయించడంతో పోలీసులు స్పందించారు. వారిద్దరినీ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక గర్భవతి కావడంతో కోర్టు స్పందించి బాలిక గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఇచ్చింది. సాధారణంగా 20 వారాల గర్భాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ ఈ కేసులో బాలికకు 25 వారాలు నిండాయి. అయినా కూడా గర్భాన్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే వైద్య పరంగా అన్ని పరిస్థితులను పరిశీలించిన అనంతరం వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రెగ్నన్సీని తొలగించాలని కోరింది. దీనిపై వైద్యులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు.