కరోనా కట్టడి చేసేందుకు మందులు - వైద్య పరికరాలు - సేవలు కొరత ఉండడంతో ప్రపంచ దేశాలు భారతదేశ సహాయం కోరాయి. ఈ పరిస్థితుల్లో మానవత్వ దృక్పథంతో భారతదేశం స్పందించి పలు దేశాలకు సహాయం చేసింది. కరోనా కట్టడికి వినియోగించే మందులు - పరికరాలు తదితర వంటివి ఆయా దేశాల్లో ప్రత్యేక కార్గో విమానాల ద్వారా తరలించారు. అయితే ఈ పని చేయడమే పైలెట్లకు శాపంగా మారింది. అలా సహాయం చేసేందుకు వెళ్లిన విమానంలో ఐదు మంది కరోనా బారిన పడ్డారు. దీంతో విమానయాన రంగంలో ఆందోళన రేకెత్తింది. ఆ కరోనా బారిన పడింది ఎవరో కాదు ఎయిర్ ఇండియా పైలెట్లు. ఏకంగా ఐదు మందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆ కంపెనీతో పాటు ప్రభుత్వం ఖంగు తింది. పైలెట్లకు ఎలా సోకిందో చదవండి..
లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అంతర్జాతీయంగా - దేశీయంగా విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఈక్రమంలో అత్యావసర సేవల కోసం ఎయిర్ ఇండియా తన విమానాలను అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా అత్యావసర - నిత్యావసర సరుకులతో పాటు మందులు - వైద్య పరికరాలు తదితర విషయాల్లో కార్గో సేవలు అందించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో చైనా మందులు సరఫరా చేయాలని కోరడంతో ఏప్రిల్ 18వ తేదీన ఢిల్లీ నుంచి 787 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం చైనాకు బయల్దేరింది. ఏప్రిల్ 20వ తేదీన చైనాలోని గువాంగ్జ్వ్‌కు వెళ్లింది. ఆ తర్వాత షాంఘై - హాంకాంగ్ ప్రాంతాలకు కూడా మందులు, ఇతర సరుకులు - వైద్య పరికరాలు తరలించారు. ఒక్కో విమానంలో ఒక టెక్నీషియన్ - ఇంజనీర్ - ఐదుగురు పైలెట్లు ఉన్నారు. ఇలా విదేశాలకు సరుకులు తీసుకెళ్లిన విమానంలో ఉన్న మొత్తం పైలెట్లు 77మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
24 గంటల అనంతరం ఫలితాలు విడుదల కాగా వారిలో ఐదు మంది పైలెట్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఎయిర్ ఇండియా అధికారులు అప్రమత్తమయ్యారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో వారి ప్రాథమిక కాంటాక్ట్స్‌ను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. సహాయం చేసేందుకు వెళ్లిన సిబ్బంది కరోనా బారిన పడడం గమనార్హం.