ఎస్ బ్యాంక్ ను ముంచిది ఆ నాలుగు కంపెనీలేనా?

Update: 2020-03-12 08:50 GMT
ప్రస్తుతం దేశంలో ఎస్ బ్యాంక్ సంక్షోభం కుదుపు రాజకీయాలతో పాటు ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేస్తోంది. కార్పొరేట్ వర్గాలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించి అద్భుతమైన ఆఫర్లు పెట్టి ప్రజల సొమ్మును పెట్టుబడి చేసి వ్యాపారం చేస్తుంటారు. ప్రజల నమ్మకమే బ్యాంకుల పెట్టుబడి అనే సూత్రం ఆధారంగా బ్యాంకులు పని చేస్తుంటాయి. కానీ అలాంటి ప్రజల నమ్మకాన్ని ఈ బ్యాంకులు పట్టించుకోకుండా కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాయడం సర్వసాధారణం. ప్రజలు, రైతుల కన్నా అత్యధికంగా ప్రాధాన్యం కార్పొరేట్ వర్గాలకు, సంపన్న వర్గాలకు బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. రైతు కేవలం రూ.వేలల్లో ఉన్న అప్పును చెల్లించకపోతే నానా రభస చేసే బ్యాంకులు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు, సంపన్నులు కోట్లలో బకాయిలు పడినా ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇలాంటి వైఖరే బ్యాంకుల సంక్షోభానికి కారణమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ బ్యాంకులే పాఠాలు నేర్వడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్ బ్యాంక్ కుంభకోణం అదే విషయం చెబుతోంది.

ప్రధానంగా ఎస్ బ్యాంక్ సంక్షోభం రావడానికి నాలుగు కార్పొరేట్ కంపెనీలు కారణంగా తెలుస్తోంది. బ్యాంకులు కార్పొరేట కంపెనీలకు, సంపన్నులకు, వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు ఉదారంగా రుణాలు ఇస్తుంటారు. అదే మాదిరి ఎస్ బ్యాంక్ కూడా నాలుగు కార్పొరేట్ కంపెనీలకు భారీ స్థాయిలో రుణాలు ఇచ్చింది. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ సంక్షోభానికి ఆ సంస్థలే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్ వ్యవస్థలో దీనిపై చర్చ సాగుతోంది. ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన ఆ సంస్థలు ప్రస్తుతం మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని కంపెనీలు దివాళా తీశాయి కూడా. వాటి పరిణామాలు కూడా ఎస్ బ్యాంక్ సంక్షోభానికి దారి తీసిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన ప్రధాన సంస్థలు
అదానీ గ్రూప్ రూ.14,730 కోట్లు
అంబానీ గ్రూప్ రూ.14,330 కోట్లు
వేదాంత గ్రూప్ రూ.11,000 కోట్లు
ఎసెల్ గ్రూప్ రూ.3, 300 కోట్లు

ఈ స్థాయిలో రుణాలు తీసుకున్న ఈ కంపెనీలు ప్రస్తుతం మనుగడ సాగించడం లేదు. అదానీ, వేదాంత గ్రూప్ కష్టాల్లో ఉన్నాయి. అంబానీ గ్రూప్ అంటే అనిల్ అంబానీ. ప్రస్తుతం ఆయన దివాళా తీశాడు. సొంత అన్న ఆయన్ను ఆదుకునే పరిస్థితికి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోతుడున్నాడు. ఇక ఎసెల్ బ్యాంక్ కూడా నష్టాలతో కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం ఆ కంపెనీ కూడా దివాళ తీసే పరిస్థితికి చేరింది. మరి ఇలా కంపెనీలు రుణాలు తీసుకుని ఎగ్గొడితే ఏ బ్యాంక్ అయిన నష్టాల బారిన పడాల్సిందేనని ప్రజలు పేర్కొంటున్నారు. కార్పొరేట్ కంపెనీలపై బ్యాంకుల తీరు మారితే మనుగడ సాగిస్తాయని, లేకపోతే మరో విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు పుట్టుకొస్తారని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు కార్పొరేట్ కు దాసోహమైతే బ్యాంకులు వారు తీసుకున్న గోతిలో వారు పడ్డట్టేనని పేర్కొంటున్నారు. అలాంటి కోవలోనే.. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ సంక్షోభమని ఆర్థిక, బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.


Tags:    

Similar News