సినిమాల్లో, ఇళ్ళల్లో ఉండే చిత్ర పాటల్లో మనం పూజించే దేవతలు, దేవుళ్ళు అందరూ దాదాపు తెల్లగానే ఉంటారు. ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి దాకా దేవుళ్ళ పాత్రలు వేసినవాళ్ళు అందరు గ్లామర్ తో మెరిసిపోతూ అందగాళ్ళు అని పేరు తెచ్చుకున్న వాళ్ళే. ఒక్క తమిళ్ లో మాత్రమే రజనికాంత్, విజయ్ కాంత్ లాంటి నల్లగా ఉన్న హీరోలు దేవుళ్ళుగా చేసినప్పుడు ఒప్పుకున్నారు. నిజానికి దేవుళ్ళు ఏ కలర్ లో ఉంటారు అనే దానికి చారిత్రక ఆధారాలు ఏమి ఉండవు. నల్లనయ్య అంటూ కృష్ణుడిని అన్నా - బూడిద పూసుకునే వాడు అని శివుడిని అన్నా వాళ్ళను మనం ఇష్టపడే సాధారణ రంగులోనే చూపించారు కాబట్టి అలాగే అలవాటు చేసుకున్నాం. కాని అదేంటి అలా ఎలా కుదురుతుంది, దేవుళ్ళు తెల్లగా ఎర్రగా ఉండాలి అన్న రూల్ ఏమి లేదు కదా అనే ఆలోచన వచ్చింది ఒక టీంకి.
చెన్నై కు చెందిన సురేష్, నరేష్ లకు ఈ డౌట్ రావడం ఆలస్యం వెంటనే తమ క్రియేటివ్ బ్రెయిన్ కు పని కల్పించారు. నల్లగా ఉండే మోడల్స్ ని వెతికి పట్టుకుని మరీ దేవుళ్ళుగా వాళ్ళకు మేకప్ వేసి ఫోటో షూట్ చేసారు. రాముడు, శివుడు, లక్ష్మి దేవి, సరస్వతి ఇలా ప్రతి ఒక్కరు నిగనిగలాడే నలుపు రంగుతో ఉండటం ఇక్కడ విశేషం. మేకప్ వేసిన బ్యూటీషియన్ కూడా బ్లాక్ కలర్ కావడంతో ఆమె కూడా సీతాదేవిగా స్టిల్ ఇచ్చేసింది. ఇవి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వీళ్ళకు వచ్చిన ఐడియాను అధికశాతం మెచ్చుకుంటున్నారు. దేవుళ్ళకు వర్ణ భేదం ఉందని, ఇలాంటివి చేయటం ద్వారా చక్కని మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్తుందని అందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒరిజినల్ నలుపుతో ఉన్నవాళ్ళే ఇందులో యాక్ట్ చేసారని చెబుతున్నా మేకప్ వాడి ఉండాల్సిన దాని కన్నా కాస్త ఎక్కువ టచప్ ఇచ్చారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా సరే ఐడియా మంచి ఉద్దేశంతో కూడుకున్నదే కాబట్టి బాగుందనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ పేరు డార్క్ ఈజ్ డివైన్. అంటే నలుపే దైవత్వం. బాగుంది కదా.