తాను ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడానంటూ వస్తున్న వార్తలను హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. తాను జిమ్ చేసుకుంటున్న వీడియోలను టీడీపీ నేతలు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు.
అర గుండు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట అనే వ్యక్తులు తాను జిమ్ చేసుకుంటున్న వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని గోరంట్ల మాధవ్ చెబుతున్నారు.
ఈ వీడియో వ్యవహారంపై ఇప్పటికే తాను అనంతపురం జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. నేరుగా తనను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ నేతలు వీడియోలను మార్ఫింగ్ చేసి తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర, కుతంత్రం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తాను ఏ విచారణకైనా సిధ్దం అన్నారు. ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిద్ధం అని ప్రకటించారు.
తనపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్న టీడీపీ నేతలు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంటలపై పరువునష్టం దావా వేస్తానని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని మండిపడ్డారు. తాను జిమ్ చేస్తున్న వీడియోలను మాధవ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో చూపించారు.
ఈ వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మాధవ్ హెచ్చరించారు. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా మహిళతో న్యూడ్ వీడియో కాల్ లో దొరికిపోయి మాధవ్ అడ్డంగా అబద్ధాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఆయనపై గతంలోనే అత్యాచారం, లైంగిక వేధింపులు, బెదిరింపులు కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ లాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.