అదేంటి అనుకుంటున్నారా? ఆలూ లేదు.. చూలూ లేదు.. అప్పుడే మంత్రి పదువులు అయిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? కానీ, టీడీపీలో మాత్రం ఆసక్తికర చర్చ ఇదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని చంద్రబాబు సహా సీనియర్ నాయకులు అంచనాకు వచ్చారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. ఇది కొంత మేరకు ఈజీ అవుతుంద ని భావిస్తున్నారు. ఒకవేళ పొత్తు లేకపోయినా(అలాగేమీ ఉండదు) తమ గెలుపును ఎవరూ ఆపలేరని కూడా వారు చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో అధికారం అయితే పక్కా అనే లెక్కలు వేసుకుంటున్నారు.
దీంతో రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. పార్టీ పదవిలోకి వస్తే.. మంత్రి వర్గంలో ఎవరెవరు ఉంటారనే లెక్కలు అప్పుడే నేతల మధ్య చర్చకు వచ్చేస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నాయకులు కలుసుకుంటే ఈ విషయాన్నే చర్చకు పెడుతున్నారు. ఆయనకు ఈదఫా మంత్రి పదవి ఖాయమంట కదా! అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. మరికొందరు ఔను.. నిజమే, వాళ్లకు పదవులు ఇస్తారు అని తేల్చి చెబుతున్నారు. మరి ఈ హాట్ టాపిక్ లో తెరమీదికి వస్తున్న పేర్లు ఏం టో చూద్దాం.
ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఖాయం. పైగా ఆయనేస్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు, తనకు హోం శాఖను అడిగి తీసుకుంటానన్నారు. సో.. ఒక పదవి రిజర్వ్. చిన్నబాబు.. నారా లోకేష్‌కు మంత్రి పదవి రిజర్వ్. అయితే, ఆయనకు ఈసారికూడాఐటీ, పరిశ్రమలే ఇస్తారని గుసగుస వినిపిస్తోంది. మరోవైపు.. యనమల రామకృష్ణుడుకు మంత్రి పదవి ఖాయం. అయితే, ఆయనకు వ్యవసాయం ఇస్తారని గుసగుసలాడుతున్నారు.
మరోవైపు.. మహిళా కోటాలో ప్రస్తుత తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కూడా మంత్రి బెర్త్ ఖాయమై పోయింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆమెకు రిజర్వ్ చేశారు. కీలకమైన ఆర్థిక శాఖను ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు బీసీ కోటాలో ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇక, నిమ్మల రామానాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పరిటాల శ్రీరాం, శ్రీరాంతాతయ్య, అశోక్ గజపతిరాజు(ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారట), గౌతు శిరీష, గద్దె రామ్మోహన్ వంటి వారికి పదవులు ఖాయమని చెబుతున్నారు. ఇదిలావుంటే, పట్టాభి వంటి అధికార ప్రతినిధులను ఈ సారి ఎమ్మెల్సీ కోటాలో సభకు పంపిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఈ వరుసలోనే వర్ల రామయ్యను రాజ్యసభకు పంపించే అవకాశం ఖచ్చితంగా ఉందని అంటున్నారు. ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజాకు చీఫ్ విప్ ఇస్తారని సీనియర్లు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ పదవుల విషయం ఆసక్తిగా మారింది. ఇక, మాజీ మంత్రి దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారికి కూడా మంత్రి బెర్తులు ఖాయం చేశారట. ప్రస్తుతం టీడీపీ సీనియర్ల మధ్య జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. మరి ఇది నిజమవుతుందో లేదో చూడాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.