ప్రత్యేక తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అధికారికంగా రద్దయింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ - కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయానికి రాజ ముద్ర పడింది. ఆ తీర్మానానికి గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. అరగంట పాటు కొనసాగిన భేటీలో వారిద్దరూ పలు కీలకమైన విషయాలు చర్చించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు కేబినెట్ ను కూడా కొనసాగించాలని గవర్నర్ కోరారు. గవర్నర్ ప్రతిపాదనకు కేసీఆర్ అంగీకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ రద్దుపై రాజ్ భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ను ఈసీ - అసెంబ్లీ కార్యదర్శులకు రాజ్ భవన్ వర్గాలు పంపించాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది.
గవర్నర్ నరసింహన్‌తో భేటీ అనంతరం కేసీఆర్ .....రాజ్ భవన్ నుంచి నేరుగా గన్ పార్కుకు బయల్దేరారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసెంబ్లీ రద్దుకు గల కారణాలను కేసీఆర్ వివరించనున్నారు. మీడియా సమావేశం అనంతరం కేసీఆర్ ఫాంహౌస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు, రేపు హుస్నాబాద్ లో జరగబోయే సభతో కేసీఆర్ ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రేపు హుస్నాబాద్‌లో కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ రద్దుకు గల కారణాలు, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాల గురించి సాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, జూన్ 2 - 2014న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు పూర్తయింది.