తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న (ఏపీ గవర్నర్ గా పదవీబాధ్యతలు చేపట్టని నేపథ్యంలో) నరసింహన్ కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం ఎంతన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దేశంలో మరే గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్యన ఇంత అనుబంధం ఉండదన్నట్లుగా వారు వ్యవహరిస్తుంటారు. తరచూ గవర్నర్ తో భేటీ అయ్యే కేసీఆర్.. ఇటీవల కాలంలో ఆయన వద్దకు వెళ్లటం తగ్గించేవారు.
గతంలో తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గవర్నర్ వద్దకు వెళ్లి చర్చ జరిపే తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన కొంత దూరాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణం.. ఢిల్లీతో నెలకొన్న పంచాయితీనే అన్న మాట ఉంది. మోడీకి.. కేసీఆర్ కు మధ్య లొల్లి నడుస్తోందని.. దీంతో మోడీ మాష్టారికి విధేయుడిగా ఉండే గవర్నర్ గారు.. కేసీఆర్ సారు విషయంలో కాస్త దూరం ప్రదర్శిస్తున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి.
ఈ వాదనలు నిజమేనన్నట్లుగా తాజాగా చోటు చేసుకున్న ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా రెండు రోజులు సమావేశమై మరీ.. సరికొత్త మున్సిపల్ బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపిన సంగతి తెలిసిందే. సాధారణంగా అసెంబ్లీ ఓకే అన్నాక.. గవర్నర్ తో కేసీఆర్ సారుకున్న దగ్గరతనం నేపథ్యంలో బిల్లుకు రాజముద్ర పడటం మినహా మరేం జరగదన్న భావన వ్యక్తమైంది.
ఈ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. కేసీఆర్ సర్కారుకు దిమ్మ తిరిగే షాకిచ్చారు గవర్నర్. ఇటీవల ఆమోదించి పంపిన మున్సిపల్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలంటూ గవర్నర్ సూచిస్తూ.. బిల్లును వెనక్కు పంపారు. కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
కేంద్రానికి బిల్లు పంపాలని నిర్ణయించటమే కాదు.. దానిని రిజర్వ్ లో ఉంచటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ట్విస్టును ఊహించని కేసీఆర్ సర్కారు అసెంబ్లీని ప్రోరోగ్ చేసింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అయినప్పటికీ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఎందుకంటే.. దీనిని కేంద్రం పరిశీలనకు పంపారు. అంటే.. కేంద్రం ఓకే అని వచ్చే వరకూ కేసీఆర్ ఈ బిల్లు విషయంలో చేయగలిగిందేమీ ఉండదన్నట్లే. తాజా పరిణామాలపై గులాబీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.