ఒక అంబులెన్స్ ఆలస్యంతో ఒకరి ప్రాణం పోయింది. సాధారణంగా ఇలాంటివి జరుగుతాయి కానీ.. వార్తల రూపంలో బయటకు రావు. అయితే.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం అందుకు భిన్నం. అంబులెన్స్ ఆలస్యం కావటంతో ప్రాణాలు పోయింది ముఖ్యమంత్రి బంధువు కావటంతో ఈ విషయానికి ఇప్పుడు ప్రాధాన్యత లభించింది. ఇంతకీ ఈ ఉదంతం ఏ రాష్ట్రంలో చోటు చేసుకున్నదంటే..
గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఒక అంబులెన్స్ ఆలస్యంగా రావటంతో ముఖ్యమంత్రి రూపానికి సోదరుడు వరుసయ్యే అనిల్ సంఘ్వీ మరణించారు. అనారోగ్యానికి గురైన అనిల్ కు సత్వరమే చికిత్స చేయించేందుకు వీలుగా ఆయన కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు.
అయితే.. రావాల్సిన దాని కంటే దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా అంబులెన్స్ వచ్చింది. దీంతో.. అనిల్ మరణించినట్లు చెబుతున్నారు. అనారోగ్యానికి గురైన వెంటనే 108కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది బయలుదేరినా.. విజయ్ మోడీ స్కూల్ వద్దకు చేరుకోవాల్సిన వారు.. పొరపాటున తప్పు అడ్రస్ కు వెళ్లారు.
దీంతో.. తాము వెళ్లిన అడ్రస్ పొరపాటన్న విషయాన్ని గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది.. అనిల్ వారి ఇంటికి వెళ్లేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచాయి. దీంతో.. ఆయన మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రాజ్ కోట్ కలెక్టర్ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు.
వరుసకు సోదరుడు అయ్యే అనిల్ మరణంతో ముఖ్యమంత్రి కలత చెందారు. ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా ఉండటానికి ఏం చేయాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కోరారట. ఇలాంటి ఉదంతమే సామాన్యులకు జరిగితే.. అధికారుల స్పందన తర్వాత.. పేపర్లో కూడా రాదు. ముఖ్యమంత్రి మంత్రి బంధువు ప్రాణాలకు ఉండే విలువ సామాన్యులకు ఎప్పుడు వస్తుందో?