హెరిటేజ్ మీద ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సదరు సంస్థ స్పందించింది. గుంటూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కొనుగోలు చేసిన భూములపైన ఆ సంస్థ వివరణ ఇచ్చింది. తాము కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తూ.. 2014లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మూడు నెలల ముందే తాము భూముల కోసం ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
గుంటూరు జిల్లా కంతేరులో హెరిటేజ్ సంస్థ 14.22 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా బుగ్గన ఆరోపించారు. దీనిపై స్పందించిన హెరిటేజ్.. వ్యాపార విస్తరణలో భాగంగా తాము ఏపీలోని ఐదు జిల్లాల్లో భూములు కొనుగోలు చేసిన వైనాన్ని ప్రస్తావించింది. 2014లో తామీ భూముల్ని కొనుగోలు చేసినట్లు పేర్కొంది.
గుంటూరు జిల్లా రేపల్లెలో ఉన్న యూనిట్ విస్తరణకు అవకాశం లేదని.. అందుకే తాము గుంటూరు - కృష్ణా జిల్లాల్లో భూములు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అప్పట్లో అనుకున్న దాని ప్రకారం మొదటి రిజిస్ట్రేషన్ జులైలో.. రెండు.. మూడు రిజిస్ట్రేషన్లు ఆగస్టులో చేశామంటూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మంత్రి చేసిన ఆరోపణల్ని కాసేపు పక్కన పెడితే.. భూములు కొనుగోలు చేసిన విషయం నిజమేనన్న విషయం కంపెనీ విడుదల చేసిన తాజా ప్రకటన స్పష్టం చేసిందని చెప్పాలి.