విలీనంపై స్పీక‌ర్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!

Update: 2019-06-11 09:55 GMT
కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బంది ఎదుర‌య్యే ఉదంతంగా దీన్ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేల‌ను ఇటీవ‌ల తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ ఎస్ లో విలీనం చేస్తూ తెలంగాణ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజా నిర్ణ‌యానికి సంబంధించిన వివ‌ర‌ణ ఇవ్వాలంటూ స్పీక‌ర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేసిన ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచారించిన కోర్టు స్పీక‌ర్ కు.. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేసింది.  విలీనంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఆందోళ‌న‌లు.. ధ‌ర్నాలు చేస్తున్న ప‌రిస్థితి. త‌మ ఎమ్మెల్యేల్ని టీఆర్ ఎస్ లో ఎలా చేరుస్తారంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు తాజాగా హైకోర్టును ఆశ్ర‌యించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ కార్య‌ద‌ర్శి.. ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్న‌ట్లుగా కోర్టు తెలిసింది.అయితే.. నోటీసులు అందుకున్న స్పీక‌ర్ నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. స్పీక‌ర్ తో పాటు.. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా త‌మ వివ‌ర‌ణ‌ను కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది.  

ఇదిలా ఉండ‌గా.. గ‌తంలోనూ శాస‌న మండ‌లిలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేసిన ఉదంతంపైనా కాంగ్రెస్ నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. విలీనంపై మండ‌లి ఛైర్మ‌న్ కు ఎలాంటి అధికారాలు లేకున్నా.. టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ను విలీనం చేశార‌న్నారు. దీనిపై స్పందించిన కోర్టు శాస‌న మండ‌లి ఛైర్మ‌న్.. కార్య‌ద‌ర్శితో పాటు.. పార్టీ మారిన ఎమ్మెల్సీల (ఎం.ఎస్. ప్ర‌భాక‌ర్ రావు.. దామోద‌ర్ రెడ్డి.. సంతోష్ కుమార్.. ఆకుల ల‌లిత‌)కునోటీసులు జారీ చేశారు. త‌దుప‌రి విచార‌ణ నాలుగు వారాల‌కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.తాజా ప‌రిణామం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News