బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కు బలి పెట్టాలని ఆత్రపడుతున్న కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు జారిచేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కౌటర్ అవిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగం ప్రకారం కూడా విరుద్ధం అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ సాగుతోంది.
స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కారణం అయిన వేలాది మంది కుటుంబాలకు ఈ రోజుకూ న్యాయం జరగలేదని ఈ పిటిషన్ లో సరైన పాయింట్లనే లక్ష్మీనారయాణ పిటిషన్ లో ప్రస్థావించారు. అలాగే వేలాది భూములు ఇచ్చినా కూడా వారికి ఉపాధి కానీ మరే విధమైన ప్రయోజనం కానీ దక్కలేదని కూడా పేర్కొన్నారు. ఇప్పటికి కొన్ని తరాలు అలాగే అన్యాయం అయిపోయాయని అన్నారు.
ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి 22 వేల మంది ప్రత్యక్షంగా మరో లక్ష మంది దాకా పరోక్షంగా బతుకుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. లాభాల బాటాలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం దారుణం అని పేర్కొన్నారు.
దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ అయితే ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. ఈ నేపధ్యంలో హై కోర్టు పూర్తి వాదనలు వినడానికి కేంద్రానికి ఏపీ సర్కార్ కి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కౌంటర్ అఫివఫిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.
అయితే స్టీల్ ప్లాంట్ మీద కేంద్రం వైఖరి స్పష్టం. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రైవేట్ కు దారులు బార్లా తెరచిన కేంద్రం లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెరగకుండా కుట్రలు పన్నుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయ్. అలాగే కీలక విభానాలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటోందని కూడా ఆరోపిస్తున్నాయి.
ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో దూకుడు మీద ఉన్న కేంద్రం అసలు విషయం బయటకు చెప్పకుండానే కధ మొత్తం నడుపుతోంది. ఈ నేపధ్యంలో హై కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమంది. మరి కోర్టుకు నిజాలే చెప్పాలి కాబట్టి కేంద్రం తన మనసులో ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి అన్నది చెబుతుందా అన్నది చూడాలని అంటున్నారు. ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ ఉగ్యోగులు ఉద్యమ కారులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.