అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికల్లో తుది పోరులో నిలవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్).. డోనాల్డ ట్రంప్ (రిపబ్లికన్) ఇద్దరూ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రైమరీ ఎన్నికలుగా చెప్పే ఈ ఎన్నికలు తాజాగా మైనే కాకసెస్.. ప్యుయెర్టో రికోలలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తుది రేసులో ఉంటారని భావిస్తున్న ఇద్దరు అగ్రనేతలు ఓటమి పాలు కావటం విశేషం.
మైనే కాకసెస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పై ప్రత్యర్థి సాండర్స్ విజయం సాధిస్తే.. ప్యుయెర్టో రికో ప్రాథమిక ఎన్నికల్లో డోనాల్డ ట్రంప్ పై మార్కోరుబియో విజయం సాధించటం గమనార్హం. మొత్తం ప్రతినిధుల సంఖ్యలో హిల్లరీ.. ట్రంప్ లు ఇద్దరూ ముందంజలోనే ఉన్నా..కొన్నిచోట్ల మాత్రం వీరిద్దరికి చుక్కెదురు అవుతోంది. అందులో భాగంగా తాజాగా ఈ ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి ఓటమి పాలు కావటం గమనార్హం.