గురి చూసి లక్ష్యాన్ని కొట్టాల్సిన అవసరం ఆటగాళ్లలోనే కాదు.. రాజకీయ నేతలకు చాలా అవసరం. ఈ విషయంలో ఆటగాడికి ఒక మ్యాచ్ పోతుంది. కానీ.. రాజకీయనేతలకు మాత్రం అధికారం చేజారుతుంది. ఎవరికి వారిగా చూస్తే.. నష్టం ఒకేలా కనిపించినా.. తీవ్రత విషయంలో రాజకీయ నేతలకు ఉండే నష్టం ఎంతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు.. వేర్వేరు రాష్ట్రాల్లోని తమ ముఖ్యమంత్రుల్ని తెలంగాణకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ ను వారి చేత విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నారు కానీ.. తమకు బోలెడంత మంది సీఎంలు ఉన్నారని.. వారేమీ ఆకాశంలో నుంచి ఊడిపడినోళ్లు కాదని.. తమ మధ్యే తిరుగుతుంటారన్న భావన కలిగేలా చేస్తున్నారు.
ఆ క్రమంలో అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాసింత క్లీన్ చిట్ ఉన్న హిమంత బిశ్వశర్మ తాజాగా తెలంగాణకు వచ్చారు. హన్ముకొండలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసోం ముఖ్యమంత్రి.. గురి చూసి కొట్టినట్లుగా.. సీఎం కేసీఆర్ వీక్ నెస్ మీద దెబ్బ కొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను.. ప్రతి రోజూ అనేక మంది సామాన్య ప్రజల్ని కలుస్తుంటానని.. అదే సీఎం కేసీఆర్ అయితే ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ ను గద్దె దించేందుకు..తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి.. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని.. తాను నాలుగు సార్లు సీఎంనని చెప్పుకోవటం.. తాజాగా అసోం సీఎం.. తాను ప్రజల్ని నిత్యం కలుస్తానని చెప్పటం చూస్తే.. కేసీఆర్ బలహీనతలు.. ఆయన ఏమైతే చేయలేకపోతారో.. ఆ అంశాల్ని హైలెట్ చేయటం ద్వారా ప్రజల్ని ఆలోచించుకునేలా చేస్తున్నారని చెప్పాలి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ఉంటుందా? అన్న భావనలోకి వచ్చిన తెలంగాణ ప్రజలకు.. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు.. ఎంతలా అందుబాటులో ఉంటారన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. కొత్త అనుభూతిని పరిచయం చేస్తున్నారు. మిగిలిన విషయాలకు ఇట్టే కౌంటర్ ఇచ్చే గులాబీ నేతలు.. ప్రజల్ని కలిసే విషయంలో కేసీఆర్ వీక్ నెస్ ను ఎత్తి చూపిన కమలనాథులకు ఎలాంటి సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.