పండుగలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగద ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించటంపై పలువురు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టపాసులు కాలిస్తే కాలుష్యం అంటున్న వైనంపై హిందువులు చేసుకునే పండుగల్ని టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇందులో నిజానిజాల సంగతి చూసినప్పుడు.. ఓ ఆసక్తికర అంశాన్ని కొందరు వ్యక్తం చేయటం కనిపిస్తుంది. వారి వాదనలో లాజిక్ పలువురిని ఆకర్షిస్తోంది. ఇంతకీ అదేమంటే..
హిందువుల ప్రతి పండగను టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. హిందువులు భారీగా చేసుకునే ప్రతి పండక్కి పర్యావరణం.. కాలుష్యం.. ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్ని తెర మీదకు తేవటం కనిపిస్తుంది. హిందువులు చేసుకునే పండగల్ని క్యాలెండర్ ప్రకారం చూస్తే.. మొదటగా వచ్చేది సంక్రాంతి.
మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండగకు సంబంధించి మేధావులు కమ్ పర్యావరణ వేత్తలు వేలెత్తి చూపించే రెండు అంశాలేమంటే.. భోగి రోజున వేసే మంట. భోగిమంట అంటూ కలపను.. పాత వస్తువుల్ని తగలబెట్టేస్తుంటారని.. దీని వల్ల వాయుకాలుష్యం పెరిగిపోవటం.. చెట్లను కొట్టేస్తుంటారంటూ అసహనం వ్యక్తం చేయటం కనిపిస్తుంది. అంతేనా.. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది తెర మీదకు వచ్చేది కోడి పందెలు. మూగజీవాల్ని అంతలా హింసిస్తారా? అంటూ ప్రశ్నిస్తుంటారు మానవతావాదులు.
ఇలా మాటలు చెప్పే వాళ్లలో చాలామంది సాయంత్రం అయితే కసా.. కసా కోసేసి చికెన్ ముక్కల్ని తింటారు. నిత్యం ఆహారం కోసం కోట్లాది కోళ్లను కోసేసినా లేని నొప్పి.. బాధ అంతా కూడా సంక్రాంతి వేళ కొన్ని ప్రాంతాల వారు ఆడే కోడి పందెల మీదనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటం కనిపిస్తుంది. చట్టం కూడా కోడిపందెలకు నో అంటే నో అనేస్తుంది. నిత్యం కోసుకు తినే కోడి పట్ల లేని కారుణ్యం.. రెండు కోళ్ల మధ్య పోటీ పెట్టే విషయంలో మాత్రం అంతులేని సానుభూతిని వ్యక్తం చేస్తుంటారు.
సర్లే.. కారుణ్యవాదులు.. సామాజిక వేత్తలు చెప్పే సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేయకుండా.. కోడి పందెలకు దూరంగా పండగ చేసుకోలేరా? అని ప్రశ్నించుకున్నంత కొద్ది నెలలకే హోలీ వచ్చేస్తుంది. హోలీ సందర్భంగా రంగులు జల్లుకోవటం చూస్తే.. ప్రమాదకరమైన రసాయనాలతో ఆడుకోవటం ఏంటి? అంటూ పెదవి విరవటం కనిపిస్తుంది. రంగులు ఆడుకోవటంతో కళ్లు పోయాయనో.. చర్మవ్యాధులకు అస్కారం ఉందనో మాట భారీగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.
సర్లే.. హోలీకి రంగులు ఆడుకోవద్దని చెప్పింది మన బాగు కోసమే కదా అని రాజీ పడినంతనే.. వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తున్నంతనే జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. నిత్యం ఏడాపెడా వాడే ప్లాస్టిక్ మీద పరిమితులు విధించలేని ప్రభుత్వాలు దగ్గర నుంచి.. ప్లాస్టిక్ వాడందే పొద్దు పొడవని మేధావి వరకూ అందరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే వినాయకుడి విగ్రహాల మీద పడిపోతుంటారు. వినాయకుడి విగ్రహాల కారణంగా పర్యావరణానికి జరిగే డ్యామేజ్ గురించి కథలు..కథలుగా చెబుతుంటారు.
కొంతలో కొంత నయం ఏమిటంటే.. పండక్కి వాడే పత్రి మీద టార్గెట్ చేయకపోవటం. తొక్కలో పండగ కోసం పచ్చదనాన్ని పాడు చేస్తారా? అన్న వాదనను షురూ చేయకపోవటం. ఇవాల్టికి ఐడియా రాలేదు కానీ.. రానున్న రోజుల్లో ఈ వాదన తెర మీదకు రావొచ్చేమో. ఇలా వినాయకచవితి వస్తుంటే చాలు.. పర్యావరణ వేత్తలకు పర్యావరణం మీద మొదలయ్యే స్పృహ అంతా ఇంతా కాదు.
వినాయకచవితి వెళ్లిపోయిన కొద్ది వారాలకే వస్తుంది దీపావళి. ఈ పండగ వస్తుందంటే చాలు.. వినిపించే సుద్దులు వింటే షాక్ తినాల్సిందే. ఏమండి.. అసలు బుద్ధుందా? డబ్బుల్ని కాల్చేయటం ఏమిటండి? ఏంచక్కా టపాసులకు కష్టపడి సంపాదించే డబ్బును వృధా చేసే కంటే దాన ధర్మాలు చేయొచ్చుగా. లేదంటే ఇతర అవసరాలకు వాడొచ్చుగా. టపాసులు కాల్చటం అంటే డబ్బుల్ని కాల్చటమే అన్న వాదనను వినిపించటమే కాదు.. టపాసుల కారణంగా వెల్లువెత్తే వాయు కాలుష్యం మీద చెప్పే మాటలు అన్నిఇన్ని కావు. భారీ శబ్దాలు.. వాయు కాలుష్యం.. అంటూ లెక్కలు తీయటమే కాదు.. పటాసులు కాల్చటంతో వచ్చే శబ్దానికి మూగజీవాలు ఎంతగా విలవిలలాడతాయో? అంటూ ఆవేదన వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు.. సగటుజీవికి ఉండే చిట్టి బుర్రకు.. అదేంది.. దేశంలో ఎంతోమంది ఉండి.. ఎన్నో పండగలు చేసుకుంటున్నప్పుడు.. హిందువులు చేసుకునే ప్రతి పండక్కి ఇలా ఏదో ఒక వాదనను వినిపించటం ఏమిటన్న సందేహం రాక మానదు. పండగల మీద సామాన్యుడికి కలిగే ఈ తరహా సందేహాల్ని మేధావులు.. మానవతావాదులు తీరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.