తాలిబన్లు ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో అమలు చేసే నిబంధనలు చాలా చిత్రంగా కనిపిస్తాయి. వ్యక్తి స్వేచ్ఛకు ఏ మాత్రం తావివ్వకుండా.. వారి ఇష్టాయిష్టాల్ని తామే నిర్దేశిస్తూ.. తమ అభిప్రాయాల్ని రుద్దటం తెలిసిందే.
కాశ్మీర్ లోయలో ఇప్పుడు ఆ తరహా పోస్టరు వెలిసి.. సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కాశ్మీర్ వ్యాలీలో ఒక్కటంటే ఒక్క సినిమా థియేటర్ అన్నది లేదు. నైట్ లైఫ్ అంటే తెలీని కాశ్మీరీలకు.. సాయంత్రం ఐదు తర్వాత రోడ్ల మీద తిరగటం అనేది ఉండదు. కొద్దిమంది ఉన్నా.. ఆరు దాటితే మాత్రం మనకు అర్థరాత్రి ఎలా ఉంటామో దాదాపుగా అలా ఉండే పరిస్థితి.
కాశ్మీర్ కు వెళ్లిన వారు.. వారి జీవనశైలిని చూసినప్పుడు.. అక్కడి పరిస్థితుల్ని చూసినప్పుడు షాక్ తినక మానరు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఉన్న చోట.. తాజాగా ఉగ్రవాదులకు సంబంధించి హిజ్బుల్ ముజాహిదిన్ సంస్థ తన ఉనికిని చాటుకుంటూ తాజాగా పోస్టర్లు వేసింది. వ్యాలీలో బ్యూటీ పార్లర్లు మూసివాలని ఆదేశాలు జారీ చేశారు.
వారు విడుదల చేసిన పోస్టర్లలో హిజ్బుల్ లోగో ఉండటం గమనార్హం. బ్యూటీ పార్లర్ల వ్యాపారాలు మూసివేయాలని.. మద్యం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తాజా పోస్టర్ల విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దృష్టి సారిస్తున్నారు. పోస్టర్ల వ్యవహారం లెక్క తేల్చటానికి పోలీసులు రంగంలోకి దిగినా.. కాశ్మీరీలు ఒక్కవిషయాన్ని మర్చిపోకూడదు. తమ స్వేచ్ఛను.. వ్యక్తిగత ఇష్టాలపై పరిమితులు పెట్టేవారిని ఏమాత్రం ప్రోత్సహించకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. లేదంటే.. ప్రతిఒక్కరూ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదు.