రేపిస్ట్ శ్రీనివాస్ రెడ్డిని పట్టించింది ఇదే..

Update: 2019-04-30 11:52 GMT
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదోతరగతి విద్యార్థి శ్రావణి మృతదేహం వెలుగుచూడడం.. ఆమె హత్య మిస్టరీగా మారడం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక సాక్ష్యం దొరికి మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సీరియల్ కిల్లరే ఈ హత్యలు చేశాడని పోలీసులు గుర్తించారు. శ్రావణితోపాటు మనీషాను అతడే హత్య చేశాడని తేలింది.  

మూడు రోజుల క్రితం శ్రావణి మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ మృతదేహాన్ని కూడా గ్రామస్థులే కనుగొని పోలీసులకు చెప్పారు. ఈకేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో గ్రామస్థులు మంగళవారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని, ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రభుత్వం వెంటనే బొమ్మల రామారం ఎస్ ఐ వెంకటేశ్ నుసస్పెండ్ చేసింది.

అయితే ఇంత పకడ్బందీగా దొరక్కుండా రెండు హత్యలు చేసిన శ్రీనివాస్ రెడ్డి.. శ్రావణి హత్య తర్వాత మాత్రం పోలీసులకు దొరకడం వెనుక ఒక సీసీటీవీ కీలకంగా పోలీసులకు పనిచేసింది. ఈ కేసు విచారణ చేసే సమయంలో పోలీసులకు గ్రామానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో శ్రీనివాస్ రెడ్డి తన బైక్ పై శ్రావణిని తీసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాల ఆధారంగానే పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో శ్రీనివాస్ రెడ్డి శ్రావణిని, మనీషాను అంతకుముందు మరో అమ్మాయిని హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం.

ఈ కేసులో సీన్ ను రీకన్ స్ట్రక్షన్ చేసే క్రమంలో ఆ బావిలోకి దిగిన పోలీసులకు శ్రావణి బాడీతోపాటు దుర్వాసన రావడంతోపాటు మనిషి ఎముకలు లభించాయి. దీంతో పోలీసులు తవ్వగా మనీషా అస్తిపంజరం లభ్యమైంది. శ్రీనివాస్ రెడ్డి సీరియల్ మర్డర్ లను ఒక సీసీటీవీ పట్టించడం ఈ కేసులో కీలకంగా మారింది.  
    

Tags:    

Similar News