హుజూర్ నగర్ బైపోల్: ఒంటి గంటకు 53% పోలింగ్

Update: 2019-10-21 08:17 GMT
తెలంగాణలో జరుగుతున్న ఏకైక అసెంబ్లీ ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటల వరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 53.89శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 302 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2.6 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. 79 సున్నితమైన ప్రదేశాల్లో పోలింగ్ బూతులను గుర్తించి పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు.

ఈసీ సీరియస్ గా తీసుకొని మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీటీవీని ఏర్పాటు చేసి పోలీసులు , అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఎన్నికలు సజావుగా జరగడానికి 2500 పోలీసులు బందోబస్తు చేపట్టారు.

మొత్తం 28మంది అభ్యర్థులు హుజూర్ నగర్ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి, బీజేపీ నుంచి కోటా రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీచేస్తున్నారు.
Tags:    

Similar News