అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బాంబ్ సైక్లోన్ గా పిలువబడే మంచు తుఫాను ధాటికి ప్రజల జీవన అస్తవ్యస్తంగా మారిపోయింది. బాంబ్ సైక్లోన్ కారణంగా పదుల సంఖ్యలో అమెరికన్లు మృతి చెందడంతో అమెరికా వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రజలు తగు జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచిస్తున్నారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం ఆయా రాష్ట్రాల్లో ముందస్తుగా విపత్తు సహాయక సిబ్బందిని అలర్ట్ చేశారు. అయితే మంచు తుఫాను కారణంగా కార్లలో ప్రయాణిస్తున్న వారంతా చలికి గడ్డకట్టుకొని చనిపోతున్నారు.
వీరిని రక్షించేందుకు అమెరికా పోలీసులు.. విపత్కర సహాయక సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మంచు ప్రభావంతో వేలాది విమాన సర్వీసులు సైతం రద్దయిన సంగతి తెల్సిందే. కాగా అమెరికాలోని సరస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలుగువారి సంఖ్య మూడుకు చేరడం తీవ్ర విషాదాన్ని నింపింది.
సోమవారం అరిజోనా సరస్సులో జరిగిన ప్రమాదంలో హరిత ముద్దన మృతిచెందగా ఆమె భర్త నారాయణ(49) గల్లంతయ్యారు. రిస్క్ సిబ్బంది ఆయన మృతదేహం కోసం గాలింపు చేపట్టగా మంగళవారం నారాయణ శవంతో పాటు గోకుల్ మడిశెట్టి అనే వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సరస్సు ఘటనలో ముగ్గురు తెలుగు వాళ్లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
అరిజోనా సరస్సు వద్దకు విహార యాత్రకు వెళ్లిన నారాయణ దంపతులు ఫోటోలు తీసుకుంటున్న క్రమంలోనే సరస్సులో పడిపోయి గల్లంతు కావడం విషాదాన్ని నింపింది. నారాయణ-హరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరిత మృతితో వారి తల్లిదండ్రులైన శ్రీరాములు.. విష్ణు కుమారిలు తీవ్ర విషాదం మునిగిపోయారు. డిసెంబర్ 28న హరిత పుట్టిన రోజున అప్పుడే ఆమెకు నూరేళ్లు నిండాయా? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
హరిత చదువులో ఎప్పుడు ముందంజలో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేశాక ఇంజనీరింగ్ చేసిందన అనంతరం హైదరాబాద్లో రెండేళ్లు ఓ కళాశాలలో అధ్యాపకులిగా పని చేసిందన్నారు. నారాయణ-హరిత మృతి వార్త తెలుసుకున్న సినీ నటుడు నందమూరి తారకరత్న మృతుడి తండ్రి వెంకట సుబ్బారావును ఫోన్లో పరామర్శించారు. అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.