అభినంద‌న్ లేకుంటే భార‌త్ కు భారీ న‌ష్టం వాటిల్లేదా?

Update: 2019-02-28 06:26 GMT
భార‌త్ కు చెందిన యుద్ధ విమాన పైలెట్ ఒక‌రు పాక్ చేతికి చిక్కారు. ఈ మాట విన్నంత‌నే చాలామంది భార‌తీయులు నిరాశ‌కు గుర‌య్యారు. యుద్ధంలో విజ‌య‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ తెలీని ఇప్ప‌టి త‌రానికి.. అదో షాకింగ్ గా అనిపించింది. తాము వెనుక‌ప‌డిన‌ట్లుగా ఫీల్ అయిన వాళ్లు ఉన్నారు. వాస్త‌వాల్ని గుర్తించ‌టం.. అస‌లు అలా ఎందుకు జ‌రిగింద‌న్న లోతుల్లోకి వెళ్లే క‌న్నా.. మ‌నోడు ఒక‌డు పాక్ సైనికుల‌కు ప‌ట్టుబ‌డ్డాడ‌న్న విష‌యానికి ప్రాధాన్య‌త ఇచ్చారు. ఆ క్ర‌మంలో అత‌గాడి సాహ‌సాన్ని.. శౌర్యాన్ని గుర్తించ‌క చాలామంది పొర‌పాటుకు గుర‌య్యారు.

నిజానికి అత‌గాడు ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం భార‌త్ కు భారీ న‌ష్టాన్ని తృటిలో త‌ప్పేలా చేయ‌ట‌మే కాదు.. దారుణ అనుభ‌వానికి దూరం చేసింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. భార‌త్ లోని ఆయుధ‌గారాన్ని టార్గెట్ చేసి వ‌చ్చిన పాక్ యుద్ధ విమానాల్ని నిలువ‌రించ‌ట‌మేకాదు.. వాటిల్లో ఒక దాన్ని కూల్చిన అభినంద‌న్‌.. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న విమానం కూలిపోయే ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకున్న ఈ ఉదంతం లోతుల్లోకి వెళితే.. భార‌త్ జ‌రిపిన మెరుపుదాడుల‌కు ప్ర‌తిగా ఏదో ఒక‌టి చేయాల‌న్న యోచ‌న‌లో ఉన్న పాక్ భారీ స్కెచ్ వేసింది. భార‌త ఆయుధ‌గారం మీద బాంబుల వ‌ర్షం కురిపించ‌టం ద్వారా.. తీవ్ర న‌ష్టం వాటిల్లేలా చేయాల‌నుకుంది. ఇందుకోసం ప‌ది పాక్ ఎఫ్ -16 యుద్ధ విమానాల్ని ప్ర‌యోగించింది.

పాక్ నుంచి యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకున్నంత‌నే భార‌త రాడార్లు ఈ విష‌యాన్ని గుర్తించారు. వెంట‌నే రంగంలోకి దిగిన భార‌త వాయుసేన నాలుగు సుఖోయ్.. రెండు విమానాలు ఆకాశంలోకి దూసుకెళ్లాయి. రెండు దేశాల‌కు చెందిన ప‌ద‌హారు విమానాల మ‌ధ్య ఆకాశంలో హోరాహోరీ పోరు జ‌రిగింది. భార‌త్ లోని ల‌క్ష్యం మీద బాంబులు వేయాల‌ని భావించిన పాక్ యుద్ధ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా భార‌త వాయుసేన పైలెట్లు పోరాడారు.

ఈ క్ర‌మంలో వారు బాంబులు జార‌విడ‌వ‌టం.. వాటిని గురి త‌ప్పేలా చేయ‌టంలో పైలెట్లు స‌క్సెస్ అయ్యారు.  దీంతో.. భార‌త వాయుసేన‌తో క‌ష్ట‌మ‌ని త‌ల‌చిన పాక్ పైలెట్లు వెనుదిరిగారు. ఇదిలా ఉంటే.. పాక్ ఎఫ్ -16 విమానాన్ని వెంటాడి కూల్చే క్ర‌మంలో అభినంద‌న్ స‌రిహ‌ద్దు దాటాడు. అత‌గాడు ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చేశాడు. అయితే.. అభినంద‌న్‌ ప్ర‌యాణిస్తున్న యుద్ధ విమానాన్ని పాక్ ద‌ళాలు కూల్చారు. త‌న ప్ర‌త్య‌ర్థి యుద్ధ విమానాన్ని కూల్చిన వైనం పెద్ద‌గా ప్ర‌చారంలోకి రాలేదు.ఎందుకంటే.. అది పాక్ ప‌రిధిలోని ప్రాంతంలో ప‌డ‌టంతో దాని వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. 
Tags:    

Similar News