కొన్ని తెగలలో ఆచారాలు కాస్తంత విచిత్రంగా..విడ్డూరంగా ఉంటాయి. వినేందుకు విస్మయం కలిగించే ఇలాంటి ఆచార వ్యవహారం హిమాలయ పర్వతసానువుల్లోని హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతంలో జరుగుతుందని చెబుతుంటారు. ఇటీవలే ఇలాంటి ఒక ఉదంతం చోటు చేసుకోవటం.. వార్తాంశంగా మారింది.
మహాభారతంలో ద్రౌపతిని.. ఐదుగురు పాండవులు పంచుకున్న తీరులోనే.. హిమాచల్ ప్రదేశ్ లోని కొన్నితెగల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి వివాహం ఒకటి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అన్నదమ్ములు.. ఒక మహిళను వివాహం చేసుకోవటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. పెళ్లి సమయంలో పెళ్లికుమారుడు ధరించే టోపీకి.. వివాహం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెబుతుంటారు.
పెళ్లి తర్వాత ఎవరైనా సోదరుడి గది బయట టోపీ వేలాడుతుంటే.. ఆ గదిలో భార్యతో ఏకాంతంతో ఉన్నట్లు. అంతే.. ఆ దిక్కుకు కూడా చూడకుండా మిగిలిన నలుగురు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారట. సోదరులు అత్యంత ప్రేమాభిమానాలతో వ్యవహరించే ఈ తెగ.. పెద్దల పట్ల కూడా గౌరవ మర్యాదలు ఎక్కువేనని చెబుతుంటారు.
హిమాలయ సానువుల్లో ఉండటం వల్ల.. మంచు.. చలి ఎక్కువగా ఉంటుందని.. ఇంటి నుంచి బయటకు చాలా తక్కువగా వస్తుంటారని చెబుతున్నారు. ఈ కుటుంబాల్లో మహిళలే ఇంటి పెద్దగా వ్యవహరిస్తుంటారట. డిజిటల్ యుగంలోనూ మహాభారతం పాత్రల మాదిరి.. చాలా విచిత్రం కదూ..?