గుడ్ న్యూస్: మహమ్మారి ఇంజక్షన్ రెడీ

Update: 2020-05-31 04:36 GMT
హైదరాబాద్ కు చెందిన ఎంఆర్.పీ.ఏ కార్పొరేషన్ సంస్థ మహమ్మారి వైరస్ కు ఇంజక్షన్ తయారు చేసి ఔరా అనిపించింది.  వైరస్ పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీస్ తో ‘హ్యుమన్ కోవిడ్19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో ఇంజక్షన్ తయారు చేసినట్టు ఎంఆర్.పీ.ఏ ప్రకటించింది.

దీనికే ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు ఈ ఇంజక్షన్ కు వచ్చిందని.. క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు సైతం తాజాగా పర్మిషన్ ఇచ్చిందని ఆ సంస్థ చైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు.

ఈ ఇంజక్షన్ మహమ్మారి వైరస్ నిర్ధారణ కాకముందు.. నిర్ధారణ అయిన తరువాత కూడా ఇవ్వవచ్చని తెలిపారు. దీనిలోని ఇమ్యూనో గ్లోబిన్స్ బాడీలోకి పంపితే అవి మహమ్మారి వైరస్ తో పోరాడుతాయని వివరించారు. వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమందిని అయినా సేవ్ చేయాలనే ఈ ఇంజక్షన్ రూపొందించామని ఆయన తెలిపారు.

ఇప్పటికే 50మందిపై క్లినికల్ ట్రయల్స్ చేసి రిపోర్ట్ అందించాలని ఐసీఎంఆర్ కోరిందని డాక్టర్ శ్రీహరి తెలిపారు. మహమ్మారి వైరస్ సోకిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే క్లినికల్ ట్రయల్స్ చేస్తామన్నారు. సక్సెస్ అయితే వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని శ్రీహరి తెలిపారు.


Tags:    

Similar News