నిజాయితీ అధికారిగా పేరొందిన కర్ణాటక పోలీసు అధికారి డి.రూప గురించి పరిచయం అక్కర్లేని సంగతి తెలిసిందే. అవినీతి కేసులో బెంగళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత అత్యంత సహచరురాలు వీకే శశికళకు జైలులో కల్పిస్తున్న ప్రత్యేక వసతుల గురించి బయటపెట్టిన ఐపీఎస్ అధికారి డీ రూప అందరి దృష్టిని ఆకర్షించారు. రూప ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీపీ)గా పని చేస్తున్నారు. శశికళకు అక్రమంగా అందుతున్న సౌకర్యాలను వెల్లడించిన ఐపీఎస్ అధికారి డీ రూపకు నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అవార్డుకు ఎంపికయ్యారని, ఈ అవార్డు కింద ఆమెకు భారీగా నగదు పురస్కారం అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకటించగా...అయితే భారీమొత్తంలో నగదు అవార్డు తీసుకునేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని పేర్కొంటూ రూప నమ్మ ఫౌండేషన్‌కు లేఖ రాయడం...అయితే అదేం లేదని ఆమె క్లారిటీ ఇవ్వడం తెలిసిన సంగతే.
ఆ పరిణామం అనంతరం ఆమె మళ్లీ వార్తల్లోకి రాలేదు. తాజాగా ఓ సంచలన ట్వీట్‌తో ఆమె మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోను రూప తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేవలం ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా ఆశ్చర్యకరమైన కామెంట్లను సైతం ఆమె పోస్ట్ చేశారు. ``సర్...మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఫిర్యాదు చేయకపోతే ఆ వ్యక్తి జైలుకు వెళ్ళేవారు కాదేమో, మీ స్పూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలను నేను బయటపెట్టాను` అంటూ పరోక్షంగా చిన్నమ్మ శశికళ విషయాన్ని ప్రస్తావిస్తూ రూప ట్వీట్ చేశారు. దీంతో సహజంగానే నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందించారు. వాటికి కూడా రూప కౌంటర్ ఇచ్చారు.
మీ తీరు బీజేపీకి అనుకూలంగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో రూప స్పందిస్తూ...`జైళ్ల శాఖలోని అవినీతిని ప్రస్తావించినపుడు ఎవరూ స్పందించలేదు. నన్ను బదిలీ చేసినప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఓ స్ఫూర్తిదాయక వ్యక్తతో కలిసి ఫోటో దిగితే మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఇదేం తీరు? ` అంటూ ప్రశ్నలు గుప్పించారు. మరోవైపు రూప ట్వీట్ వైరల్ అయింది.