గంజాయి అడ్డు కట్ట సాధ్యమేనా ?

Update: 2021-11-03 03:30 GMT
ఇపుడి దే అంశం రాష్ట్రాన్ని పట్టి ఊపే స్తోంది. నిజాని కి గంజాయి, డ్రగ్స్ అనే సమస్య ఏపీ కి మాత్రమే పరిమితం కాదు. యావత్ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. నిజాని కి దేశం మొత్తం మీద డ్రగ్స్, గంజాయి కేసు ల్లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కేరళ, తమిళ నాడు, మహారాష్ట్రలు టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఉన్నాయి. ఏపీ స్ధానం 18 లో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ పరిధి లోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నే స్పష్టంచేసింది.

గణాంకాలు ఇంత స్పష్టం గా కని పిస్తున్న డ్రగ్స్, గంజాయి విషయం లో ఏపీ లోనే ఎక్కువ గోల జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే ప్రతి పక్షాలే అని ప్రత్యేకం గా చెప్ప క్కర్లేదు. గంజాయి సాగు దశాబ్దాలు గా జరుగుతోందన్న విషయం తెలిసినా జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత మాత్రమే గంజాయి సమస్య మొదలైనట్లు చంద్ర బాబు నాయుడు, ఆయన కు మద్దతి చ్చే మీడియా నానా గోల చేస్తున్నది. జగన్ వల్లే తాము ఘోరం గా ఓడి పోయామన్న అక్కసు చంద్రబాబు అండ్ కో లో రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఇలాంటి నేపధ్యం లోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వం లో వైజాగ్ లో గంజాయి సాగు, రవాణా, వినియోగం, అమ్మకం విషయం లో అంతర్రాష్ట్ర సమావేశం జరిగింది. తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, ఒడిస్సా, కేరళ రాష్ట్రాల కు చెందిన పోలీసు ఉన్నతాధికారుల తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఏవోబీలోని రెవిన్యు, ఐటీడీఏ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గంజాయి సమస్య ను కంట్రోల్ చేయటానికి పై రాష్ట్రాల్లోని శాఖల తో సమన్వయ కమిటి ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.

గంజాయి, డ్రగ్స్ సమస్య నియంత్రణ కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయ బోతున్నట్లు చెప్పారు. ఈ పోర్టల్లో గంజాయి సాగు, వ్యాపారం, అమ్మకందారుల వివరాల తో పాటు డ్రగ్స్ కేసులు, చరిత్ర, పై రాష్ట్రాల్లోని సమస్యలన్నింటినీ పోర్టల్లో ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. పోర్టల్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామన్నారు. అవసర మైనపుడు శాటిలైట్ ఇమేజెస్, ద్రోన్ల సాయాన్ని కూడా తీసుకో వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గంజాయి సమస్య రాష్ట్రం లో ఎప్పటి నుండో ఉన్నా ప్రతిపక్షాలు ఇపుడు మాత్రమే ఆరోపణలు చేయటం సరి కాదని అభిప్రాయ పడ్డారు.

నిజాని కి గంజాయి సాగును నియంత్రించటం కష్టమే. అయితే అంతర్రాష్ట్ర సహకారం తో గట్టి గా ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. ఏవోబీ ప్రాంతం లోని గిరిజనుల్లో చైతన్యం తీసుకురావటం తో పాటు మావోయిస్టుల సమస్య ను కంట్రోల్ చేయగలిగితే మెల్లి గా అయినా ఈ సమస్య ను కంట్రోల్ చేయచ్చు. కాక పోతే సవాంగ్ చెప్పినట్లు గంజాయి రవాణా లో రాజకీయ నేతలు, పోలీసులు, ఇతర శాఖల కు చెందిన వారిని ముందు గా గుర్తించి ఉక్కు పాదం మోప గలిగితే సాధ్యమవుతుంది.
Tags:    

Similar News