తెలంగాణ లో ప్రస్తుతం టి ఆర్ ఎస్ పార్టీ ఎదురు లేని శక్తిగా ఉంది. దాదాపుగా తెలంగాణ లో ఉన్న సీనియర్ రాజకీయ నేతలందరూ తెరాస లోనే ఉన్నారు. దీనితో దినదినాభివృద్ధిగా తెలంగాణాలో దూసుకుపోతుంది. కానీ , ప్రస్తుతం ఆ పార్టీలోని ఒక సీనియర్ నేత , పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీలో కీలకంగా పనిచేసిన అయన .. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని నెలలుగా పార్టీ అధినేతపై, ఆ లీడర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకి తగిన గుర్తింపు దక్కడంలేదు అని అయన భాద పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ..తెరాసకి త్వరలోనే షాక్ ఇవ్వబోతున్న ఆ సీనియర్ నేత ఎవరంటే ..?
తెరాస లో పరిచయం అక్కర్లేని పేరు నాయిని నర్సింహారెడ్డి. టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి కేసిఆర్ తో కలిసి నడిచిన అతికొద్ది మందిలో నాయిని కూడా ఒకరు. కేసిఆర్ ఎక్కడ మాట్లాడినా ఆయన పక్కనే ఉండే వారు నాయిని. కార్మిక సంఘాల నాయకుడిగా ఎంతో పేరున్న నాయిని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేబినెట్ లో నెంబర్ టు స్థానంలాంటి హోంమంత్రి పదవి ఆయనకి కట్టబెట్టారు. నాయినిని అన్నా అని పిలిచే కేసీఆర్, ఆయన పెద్దరికానికి అంతగా ప్రాధాన్యమిచ్చారు. అలా కేసీఆర్‌తో నిత్యం వెంటనడిచిన నాయిని నర్సింహారెడ్డి, ఇప్పుడు ఎక్కడా కనపడ్డం లేదు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అసలాయన పార్టీలో వున్నారా లేరా అన్న సందేహాలు కూడా కొందరికి వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు అయన ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని.
ఉద్యమకాలం నుండి కేసీఆర్-నాయిని మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండేది. కానీ, 2018లో జరిగిన ఎన్నికల్లో నాయినికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వలేదు. తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కోసం కూడా చివరి వరకూ ప్రయత్నించారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీనితో అయన లాగడంతో , సీఎం కేసీఆర్ బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. అయితే పార్టీకి నాయిని సేవలు వాడుకోవాలనుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం నాయినికి ఎమ్మెల్సీ పదవి ఉంది. అది కూడా మరో నాలుగు నెలల్లో పూర్తవుతోంది. మళ్లీ ఈ పదవిని ఆయనకే కట్టబెడతారో ..లేదో అనేది అయన వర్గంలో తీవ్రమైన చర్చలకు దారితీస్తుంది.
కొద్ది రోజులుగా నాయిని సైలెంట్‌గా ఉంటున్నారు. తన అల్లుడికి టికెట్ ఇవ్వలేదు, తనకు పార్టీలో కీలక పదవి ఇస్తామని అది కూడా లేదు అని తన సన్నిహితులతో వాపోతున్నారట. కొన్నిసార్లు కేసీఆర్‌పైనా పరోక్ష విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధినేత తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తితో వున్న నాయిని, కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడుతున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు అయన పార్టీ మారిన పెద్ద ప్రయోజనం లేదు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తన తన అల్లుడి రాజకీయ జీవితాన్ని దారిలో పెట్టాలి అంటే అయన పార్టీలోనే వుండాలి. అందుకే నాయిని గట్టిగా విమర్శలు చేయలేకపోతున్నారని కొందరంటున్నారు. చూడాలి, నాయిని వచ్చే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో ..