జగదీశ్ రెడ్డిని ఆంద్రా ప్రజలు నిజంగానే గెలిపిస్తారా?

Update: 2017-07-21 12:52 GMT
టీఆరెస్ నేత, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని.. తెలంగాణలోనే కాదు, ఏపీ నుంచి పోటీ చేసినా కూడా తాను గెలుపులో డౌటే లేదని ఆయన ధీమా కనబరిచారు.
    
2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టీఆరెస్ టిక్కెట్లు దక్కుతాయని... నల్గొండ జిల్లాలోని 12 సీట్లు సహా, తెలంగాణలో 110 స్థానాలు టీఆరెస్ గెలుచుకుంటుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని, ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తానని అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించే నేపథ్యంలో కేంద్రంతో సఖ్యత అవసరమని, ప్రతి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని అన్నారు.
    
నిత్యం రాజకీయలు చేయడం అనవసరమని.. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తే చాలని చెప్పిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని తేల్చేశారు.
    
అయితే.. జగదీశ్ ప్రకటన నేపథ్యంలో నెటిజన్లు ఏపీ కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో ఒక్క సీటు కూడా గెల్చుకోని కాంగ్రెస్ 2019 ఎన్నికల్లోనూ బోణీ చేసే సూచనలు కనిపించడం లేదని.. రాష్ర్ట విభజనకు కారణమైన టీఆరెస్ నేత కూడా ఏపీలో గెలుస్తానని ధీమాగా చెప్తున్నారు కాబట్టి ఆయన వద్ద ఏపీ కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆ గెలుపు రహస్యమేంటో తెలుసుకుంటే బెటరని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News