టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్ల కింద నేల కదిలేలా కీలక ప్రకటన చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన మూడు రోజులుగా చర్చ జరుగుతోందని.. ఆ శాఖా మంత్రి పోలవరంపై సభలో పలు అంశాల్ని చెబుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మొత్తం కుంభకోణాల మయంగా మారిందని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని.. ఇటీవలే తాను పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చానన్నారు. గడిచిన నాలుగు నెలలుగా పనులు ఆగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నవంబరులో ప్రారంభమయ్యే పనులు 2012 జూన్ నాటికి పోలవరం నీళ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. మరో పదిహేను రోజుల్లో పోలవరంలో దోచేసిన సొమ్ము లెక్కల్ని తాము బయటపెడతామన్నారు.
నామినేషన్ల పద్దతిలో ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చారని.. యనమల వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశామని.. అందుకు శాంపిల్ గా ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. ఎలాంటి పనులు ప్రారంభించకుండానే అడ్వాన్స్ ల రూపంలో దోచేశారన్నారు.
పనులు ప్రారంభం కాకుండానే రూ.724 కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్ ల రూపంలో కట్టబెట్టారన్నారు. టీడీపీ హయాంలో పోలవరంలో ఎంత దోచిందన్న విషయాన్ని 15 రోజుల్లోనే బయటకు వస్తుందన్న బాంబు పేల్చారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇష్టం వచ్చిన వారికి.. ఇష్టం వచ్చిన రీతిలో పనులుకట్టబెట్టారన్న విమర్శ ఉంది. ఇలాంటివేళలో.. ఈ ప్రాజెక్టు విషయంలో పదిహేనురోజుల్లో లెక్క తేలుస్తానని చెప్పటం.. బాబు సర్కారు చేసిన అవినీతి గుట్టురట్టు చేస్తానని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.